స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి పార్టీ జోరు మీద ఉంది. రాజధాని ప్రాంతం గుంటూరు లో అత్యధికంగా వైసీపీ పార్టీకి ఏకగ్రీవాలు నమోదయ్యాయి. చాలా ఎంపీటీసీ స్థానాల్లో ఒకటే నామినేషన్ వేయటంతో రాజధాని ప్రాంతంలో వైసీపీకి మంచి ఆదరణ ఉందని తేలిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి మంచి జోరు చూపిస్తుంది. మాచర్లలో 36 వార్డులలో దాదాపు చాలా వరకు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే రాజధాని పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు వైసిపి కె ఏకగ్రీవం అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. దీంతో రాజధాని ప్రాంత ప్రజలకూ వైసిపి పార్టీ పై ఎటువంటి ఆగ్రహం లేదని స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బట్టి అర్థం అవుతున్నాయి. మొత్తం మీద ప్రస్తుతం ఏపీ లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్నది దుశ్ప్రచారమని  తేలిపోయింది.

 

గత రెండు నెలల నుండి తెలుగు మీడియాలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే బాబోరు మీడియా… వైయస్ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అమరావతి ప్రాంతం పై లేనిపోని కథనాలు ప్రసారం చేస్తూ రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినట్లు ప్రస్తుత పరిస్థితులు బట్టి తెలుస్తోంది. నిజంగా అమరావతి రాజధాని ప్రాంత ప్రజల్లో చిత్తశుద్ధి ఉంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మరియు నాయకులు ఎందుకు వైసీపీకి సపోర్ట్ చేస్తారు అన్న ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమైంది. దీంతో రాజధాని ప్రాంతం పై జగన్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో… ఏకగ్రీవం అవుతున్న పరిస్థితుల బట్టి సీఎం జగన్ ని ఉద్దేశించి అమరావతి పై వస్తున్న వార్తలు అవాస్తవమని అందరికీ అర్థమైపోయింది.

 

నిజంగా అమరావతిలో రైతులు అనే వారు చేస్తున్న దీక్ష అయితే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వైసీపీ పార్టీకి ఏమాత్రం డిపాజిట్ రాదని.. కానీ అనూహ్యంగా వైసీపీ పార్టీకి ఏకగ్రీవ స్థానాలు రావడంతో అమరావతి రాజధానిని అడ్డంపెట్టుకుని కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని వాళ్ళకి కొంత మీడియా సపోర్టు ఉందని తాజా పరిస్థితుల బట్టి అర్థమవుతుందని… రాజధాని ప్రాంతంలో వైసీపీ పార్టీకి ఏకగ్రీవం అయిన స్థానాలను ఉద్దేశించి రాష్ట్రంలో ఉన్న సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: