రాజకీయాల్లోకి ఏ మూహుర్తాన ఎంట్రీ ఇచ్చాడో తెలియదు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాలం అస్సలు కలిసి రావడంలేదు అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి రాజకీయ పరిస్థితులు పవన్ కళ్యాణ్ కు అస్సలు కలిసి రావడం లేదు. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశా నిస్పృహల్లో మునిగి తేలుతున్నారు.ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నా, జనసేన లో చెప్పుకోదగ్గ మార్పు కనిపించడం లేదు. దీనికి కారణం క్షేత్ర స్థాయిలో బలం లేకపోవడమే. పైగా ఏపీలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. ఇక్కడ కూడా జనసేనకు చేదు ఫలితాలే వస్తాయనడంలో సందేహం లేదు అన్నట్టుగా ఉండడంతో చాలా చోట్ల అభ్యర్థులు పోటీ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లోనూ జనసేన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేలా కనిపిస్తోంది. ఇప్పుడు జనసేన కు మరో ఆందోళన పెరిగిపోతోంది. 

 

IHG


జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జరుపుకోబడుతుంది. 2014 మార్చి 14 జనసేన పార్టీని స్థాపించారు. మార్చి 14వ తేదీ పుట్టిన రోజు జరుపుకోవాలని చూస్తోంది. 2018 లో రాజమండ్రి వేదికగా 2019 గుంటూరు వేదికగా జనసేన ఆవిర్భావ వేడుకలు జరిగాయి. అదేవిధంగా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని ముందుగా భావించారు. అయితే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు అనేక నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. 


స్థానిక సంస్థల ఎన్నికలు కారణంగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉండటంతో 144 సెక్షన్ తో పాటు పార్టీపరంగా బహిరంగ సభలు చేపట్టి అనేక అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా పూర్తిస్థాయి నిఘా కూడా ఉంటుంది. వాటిలో పార్టీలు నేతలు, అభ్యర్థులు చేసే ప్రసంగాలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులు అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికల మేనిఫెస్టోలో ఇలా అనేకం ఉంటాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా, జనసేన ఆవిర్భావ వేడుకల కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయిస్తే, ఆ పార్టీ అధినేత జగన్ ఆత్మరక్షణలో పడతారని జనసేన, బిజెపి ముందుగా భావించాయి.


 అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా జనసేన ఆవిర్భావ వేడుకలు చేయాలా ? వద్దా అనే సందిగ్ధం లో పవన్ కళ్యాణ్ ఉండిపోయారు. ఒకవేళ వేడుకలు చేసినా, తమ ప్రసంగాల్లో ఎక్కడో ఒక చోట వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందని, దాని ద్వారా వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టే అవకాశం ఉండడంతో ఏం చేయాలనే విషయంపై ఎటూ తేల్చుకోలేకపోతోంది జనసేన.

మరింత సమాచారం తెలుసుకోండి: