కరోనా అంటేనే ప్రపంచం మొత్తం హడలిపోతుంది..ఏ దేశాన్ని వదలకుండా దాదాపు అన్ని దేశాలకు ఫ్రీగా పాకుతున్న ఈ మాయదారి రోగంతో ఎన్నో మరణాలు సంభవించగా, చాలా మంది ఈ వ్యాధితో పోరాడుతున్నారు.. ఎంతగా ప్రయత్నించిన ఈ రోగాన్ని అరికట్టలేకపోతున్న వైద్యబృందాలు, ఇంకా ఆశతో తమ వంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.. ప్రస్తుతం ఆ కరోనా వల్ల ప్రతి దేశ ఆర్ధికపరిస్దితుల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. దీని ప్రభావం ప్రజలమీద రానున్న రోజుల్లో ఎంతలా చూపిస్తుందో అని ఆలోచిస్తే గుండెవేగం పెరిగిపోతుందట..

 

 

ఇకపోతే ఇప్పటికే భారత్‌లో కరోనా వల్ల ఒకరు మరణించిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఈ సంఖ్య రెండుకు చేరింది.. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దేశంలో మహమ్మారి కారణంగా రెండో మృతి నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇకపోతే దేశ రాజధానిలో కరోనా పాజిటివ్‌గా నమోదైన వారిలో ఈ మహిళ ఆరోవది. హైబీపీ, డయాబిటిస్ ఉన్న ఈ మహిళ కరోనాను జయించలేక చివరికి ఓడిపోయి మరణాన్ని చేరింది..

 

 

ఇక పశ్చిమబెంగాల్‌లో ఉండే ఈ మహిళకు ఆమెకు కొడుకు ద్వారా వైరస్ సోకింది. ఇతను గత నెలలో స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వచ్చి తనకు ఉన్న కరోనా వైరస్‌ను తల్లికి అంటించాడు. కానీ కొడుకు కంటే వేగంగా తల్లిలోనే ఈ లక్షణాలు కనిపించడం తో ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ లో మార్చి 7న చేర్పించి పరీక్షించగా, కరోనా ఉన్నట్లు తేలిందట.. ఇక అప్పటి నుంచి ఫ్యామిలీ మొత్తానికి ఐసోలేషన్ లో చికిత్స అందిస్తూ అబ్జర్వేషన్ లో ఉంచారు.

 

 

అయితే ముందుగా తల్లి మరణించడంతో ఆ కుటుంబలో విషాదచాయలు అలుముకున్నాయి.. ఇకపోతే భారత్‌లో కరోనా కేసులు ప్రస్తుతం 85కు చేరాయి. గురువారం కర్ణాటకలో 76ఏళ్ల వృద్ధుడు చనిపోయిన తర్వాతి రోజే మహిళ చనిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: