అమరావతి పరిరక్షణ ఉద్యమం పేరుతో టీడీపీ నెత్తికెత్తుకున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు అనుకూల మీడియా సంస్థలు పాపం.. చాలా కష్టపడ్డాయి.

అమరావతి రైతులకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా చాలు.. వారికి తమ ప్రసార సాధనాల్లో సాధ్యమైనంత ఎక్కువ స్పేస్ ఇచ్చాయి.

 

 

సీఎం జగన్ ను తిడతావా.. అయితే నువ్వు ఎవరైనా సరే.. మాకు వీఐపీవే.. ఇలా సాగింది ఆయా మీడియా సంస్థల తీరు. అమరావతి రైతుల ఉద్యమం మొత్తానికి దాదాపు 3 నెలలు పూర్తి చేసుకుంటోంది. శత దినోత్సవం వైపు వెళ్తోంది. కానీ.. పాపం.. చంద్రబాబు అనుకూల మీడియా కూడా మొదట్లో ఇచ్చినంత ప్రయారిటీ ఇవ్వడం లేదు.

 

 

ఎందుకంటే.. అమరావతి ఉద్యమాన్ని నెత్తికెత్తుకోవడం వాటికి ఇష్టం లేక కాదు.. కానీ.. అనుకోకుండా తెరపైకి వచ్చిన కరోనా సునామీ... మరోవైపు స్థానిక ఎన్నికల నేపథ్యంలో వేడెక్కిన రాజకీయంతో అవి కూడా అమరావతి ఉద్యమాన్ని గాలికొదిలేయక తప్పడం లేదు. పాపం.. రెండు నెలల వరకూ చంద్రబాబు అనుకూల మీడియా సంస్థలైన ఆ మూడు ఛానళ్లు బాగానే కవర్ చేశాయి.

 

 

కానీ ఓవైపు కరోనా ముంచుకొచ్చేసింది.. మొదట్లో చైనాకే పరిమితం అనుకున్నా.. ఆ తర్వాత ప్రపంచాన్ని మింగేస్తోంది. దీనికి ప్రయారిటీ ఇవ్వక తప్పదు.. మరోవైపు అనూహ్యంగా స్థానిక ఎన్నికలు వచ్చేశాయి.. వీటికీ ప్రయారిటీ ఇవ్వక తప్పదు.. ఈ రెండింటిం కారణంగా తమకు ఇష్టం లేకపోయినా అమరావతి ఉద్యమాన్ని ఈ ఛానళ్లు పక్కకు పెట్టేసినట్టే కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: