ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా వైరస్ తో ఇప్పటి కే ప్రపంచ వ్యాప్తంగా ఐదేవేల మంది మరణించినట్లు చెబుతున్నారు.  ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యల్లో ఈ వైరస్ భారిన పడి చికిత్స పొందుతున్నారు. అయితే ఇది లెక్కలో మాత్రమే.. ఈ వైరస్ గురించి తెలియక.. సరైన చికిత్స పొందని వారు ఇంకెంత మంది ఉన్నారో తెలియని పరిస్థితి.  ఓ పక్క అవగాహన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చైనాలో ఈ వైరస్ ప్రభావం తగ్గినా.. ఇతర దేశాల్లో ప్రబలిపోతుంది. ఇటలీలో మరణాల సంఖ్య వేయికి దాటిందని అంటున్నారు. ఇరాన్, దక్షిణ కొరియా, సూడాన్, అమెరికా ఇలా ఒక్క దేశమేంటి అన్ని దేశాల్లో కరోనా కలకలం సృష్టిస్తుంది.   

 

కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పూనుకున్నాయి. దేశంలో తొలి కొవిడ్ మరణం నమోదైంది. కర్నాటకలోని గుల్బర్గాకు చెందిన 76 ఏళ్ల వ్యక్తి వైరస్‌కు బలయ్యాడు. కరోనాతో చనిపోయాడన్న అనుమానంతో అతడి శాంపిళ్లను టెస్టులకు పంపించారు. టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ వ్యక్తి చనిపోయింది కరోనాతోనేనని కర్నాటక ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆ వ్యక్తి ఇటీవలే సౌదీ నుంచి గుల్బర్గాకు వచ్చాడు.  దాంతో భారత్ లో సైతం డేంజర్ బెల్ మోగిందని అంటున్నారు. 

 

ఈ వార్త మరవకముందే మరో మరణం సంబవించింది.  కరోనా లక్షణాలతో ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరిన 68 ఏళ్ల ఢిల్లీ మహిళ మృతి చెందింది. ఈ మేరకు ఢిల్లీ వైద్యశాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ తెలిపారు. ఆమె మృతితో దేశంలో కరోనా మృతుల సంఖ్య రెండుకు పెరిగింది.  ఈ నెల 9న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో అప్పటి నుంచి వెంటిలేటర్స్‌పైనే ఉంచి చికిత్స అందించారు. అయితే, పరిస్థితి మరింత దిగజారడంతో గత రాత్రి ఆమె మృతి చెందారు. మొత్తానికి ఇప్పుడు భారత్ లో కరోనా మరణాలు మొదలయ్యాయి.. జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: