పూర్వకాలంలో పెద్దలు పెట్టిన ఆచారాలను నేటికాలం మనుషులు అవహేళన చేస్తున్నారు.. మనుషుల మనుసుల్లో అడ్డుగోడలు కట్టుకుని ఆప్పటి ఆచారాలు పనిలేక పెట్టారనే భావంతో జీవిస్తున్నారు.. అందుకే కావచ్చూ ఆ కాలంలో లేని కొత్త కొత్త రోగాలు నేటికాలంలో సంభవిస్తూ మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి.. మన భారతదేశ సంస్కృతులు, సంప్రదాయాలంటే అందరికి చులకన అయిపోయిన సమయాన కరోనా అనే వ్యాధి వచ్చి ఒక్క సారిగా భారదేశ సంప్రదాయాలను వెలుగులోకి తెచ్చింది.. ఇంత కాలం బూజుపట్టి పట్టించుకునే దిక్కులేని మన ఆచారాలు ప్రస్తుతం ఓ వెలుగు వెలిగిపోతున్నాయి..

 

 

ఇకపోతే హాయ్ అంటూ చేతులు కలుపుకునే ఆచారానికి కొంతకాలం బ్రేక్ పడినట్లే.. ప్రస్తుత పరిస్దితుల్లో నమస్కారం ప్రపంచ దేశాలకు సంస్కారంగా మారింది.. క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌న ఆచారాల వెనుక ఉన్న మంచిని ప్ర‌పంచం గుర్తించింది. అందుకే వివిధ దేశాల‌కు చెందిన దేశాధినేత‌లు ఇప్పుడు మ‌న ఆచారాన్ని పాటిస్తున్నారు. షేక్ హ్యాండ్, ఆలింగ‌నాలు చేసుకోవ‌డాన్ని ప‌క్క‌న‌పెట్టి భార‌తీయుల్లా న‌మ‌స్తే అని చెబుతున్నారు... పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా ఏ ఇద్ద‌రు వ్యక్తులు క‌లిసినా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగ‌నం చేసుకుని, ముద్దాడుతుంటారు. చివరికి దేశాధినేతలు కూడా ఇవే ప‌ద్ధ‌తులు పాటిస్తుంటారు.

 

 

అయితే ఈ పద్దతులే ఇప్పుడు వారి కొంపలు ముంచుతున్నాయని గుర్తించిన విదేశీయులు.. దెబ్బకు వారి ప‌ద్ధ‌తులు వ‌దిలి మ‌న ప‌ద్ధ‌తిలో న‌మ‌స్తే పెట్ట‌డం ప్రారంభించారు.. ఇకపోతే ఒక మ‌నిషి నుంచి మ‌రో మ‌నిషికి క‌రోనా వేగంగా, సులువుగా వ్యాపిస్తుందన్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా క‌రోనా ఉన్న వారు ఎవ‌రికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఆలింగ‌నం చేసుకున్నా, తుమ్మినా, ద‌గ్గ‌ర‌గా మాట్లాడినా ఈ క‌రోనా అవ‌త‌లి వ్య‌క్తికి కూడా వ్యాపిస్తుంది. కాబట్టి వారందరు న‌మ‌స్తే చెబితే మేల‌ని భావిస్తున్నారు. చూసారా నమస్తే అంటే మనం నామోషీగా ఫీలవుతాం. కానీ ఇదే నమస్కారం ఇప్పుడు ప్రాణాలను కాపాడే పరిష్కారంగా మారి ప్రపంచం అంతా కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుంది.. ఇదే మన భారతదేశం యొక్క గొప్పదనం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: