కరోనా  వైరస్ ప్రస్తుతం ఎంతో మందిని ప్రాణ భయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలకు శర వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్.. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఇక రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి కూడా పెరుగుతూ వస్తోంది. ఇక అటు భారతదేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతో భారత ప్రజలందరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. పెళ్లికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా... కరోనా వైరస్ మాత్రం శర వేగంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వస్తున్న వారి నుండి కరోనా  వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతి ఆస్పత్రిలో కరోనా  లక్షణాలున్న అనుమానితుల కోసం ప్రత్యేక  ఐసొలేషన్  వార్డుల్లో చికిత్స  కూడా అందించారు. 

 

 

 అయితే తాజాగా కేరళలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. కరోనా  వైరస్ లక్షణాలు ఉన్న అమెరికా దంపతులు కేరళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని నగరంలో చోటు చేసుకుంది. మూడేళ్లుగా లండన్ నగరంలో నివాసం ఉంటున్న అమెరికా దంపతులు... ఈనెల 9వ తేదీన దోహా మీదుగా కేరళ రాష్ట్రానికి వచ్చారు. ఇక వీరిద్దరూ ఈ నెల 10వ తేదీన కొచ్చిలోని కోట ను సందర్శించారు. ఇక ఆ తర్వాత అల్లప్పుజా  నగరంలో కూడా పర్యటించారు ఈ అమెరికా దంపతులు. ఆ తర్వాత వర్కాల రైల్వే స్టేషన్ కు వచ్చారు  

 

 

 అయితే ఈ అమెరికా దంపతులకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో... వెంటనే అమెరికా దంపతులను అల్లప్పుజా  వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అమెరికా దంపతులు ఎక్కడెక్కడ పర్యటించారూ...  ఎవరెవరిని కలిశారు అనే విషయాలను తెలుసుకున్నారు వైద్యులు. ఇక వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే శుక్రవారం సాయంత్రం అమెరికా దంపతులు మాత్రం డాక్టర్లకి షాకిచ్చారు. డాక్టర్ల కన్నుగప్పి ఆస్పత్రి నుంచి పారిపోయారు. ఇక ఆస్పత్రి నుంచి పారిపోయిన అమెరికా దంపతులకు కరోనా  లక్షణాలు ఉండడంతో వారి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని అలప్పుజ జిల్లా కలెక్టర్ ఎం అంజన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: