గెలుపు అవకాశమే లేనిచోట ఓ ఎస్సీ అభ్యర్ధిని రాజ్యసభ ఎన్నికల్లో పోటి పెట్టిన చంద్రబాబునాయుడే  చివరకు దెబ్బ కొట్టాడా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. అభ్యర్ధిగా వర్ల వేసిన రెండు సెట్ల నామినేషన్లలో సంతకాలు పెట్టిన ఎంఎల్ఏల్లో పదకొండో ఎంఎల్ఏనే లేకపోవటమే విచిత్రంగా ఉంది.  ఇంతకీ విషయం ఏమిటంటే నామినేషన్ వేసిన ప్రతి అభ్యర్ధికి పదిమంది ఎంఎల్ఏలు ప్రపోజర్లుగా సంతకాలు చేయాలి. వైసిపి తరపున అభ్యర్ధుల నామినేషన్లలో ప్రతి దానికి పదిమంది ఎంఎల్ఏలు సంతకాలు పెట్టారు.

 

వైసిపి వాళ్ళు ఒక్క నామినేషనే వేయటంతో పదిమంది ఎంఎల్ఏల సంతకాలు సరిపోయాయి. కానీ టిడిపి తరపున పోటిచేస్తున్న వర్ల మాత్రం  రెండు సెట్ల నామినేషన్లు వేశారు. రెండు సెట్ల నామినేషన్లు అంటే మొత్తం 20 మంది ఎంఎల్ఏలు సంతకాలు చేయాల్సుంటుంది. అంటే ఒకే ఎంఎల్ఏ రెండు సెట్లలోనూ సంతకాలు పెట్టచ్చు లేండి. కానీ ఇక్కడ జరిగిందేమిటంటే వర్ల వేసిన రెండు సెట్లలోను పదిమంది ఎంఎల్ఏలే సెట్లలోను సంతకాలు చేశారు.

 

మొదటిసెట్లో సంతకాలు చేసిన పదిమంది ఎంఎల్ఏలే రెండోసెట్లో కూడా సంతకాలు చేశారన్నమాట.  ఇలా చేయటం తప్పేమీ కాదు. కానీ పార్టీ తరపున 23 మంది ఎంఎల్ఏలు గెలిచారు. ఇందులో ముగ్గురు ఎంఎల్ఏలు పార్టీకి దూరమైపోయారు. మరి ఇంకా 20 మంది ఎంఎల్ఏలున్నారు కదా ? వర్ల రెండు సెట్ల నామినేషన్లు వేస్తున్నపుడు రెండింటిపైనా ఆ 20 మంది ఎంఎల్ఏలతో సంతకాలు చేయించవచ్చు కదా ? అలా కాకుండా పదిమంది ఎంఎల్ఏలు మాత్రమే రెండు సెట్లలోను  సంతకాలు చేయటమేంటి ?

 

అంటే వర్ల వేసిన నామినేషన్లలో సంతకాలు పెట్టటానికి అందరు ఎంఎల్ఏలు ఇష్టపడలేదా  ? అన్న అనుమానం వస్తోంది. అందరి ఎంఎల్ఏలతోను చంద్రబాబు ఎందుకు సంతకాలు చేయించలేకపోయాడు ? వర్లను ప్రపోజ్ చేస్తు పదకొండో ఎంఎల్ఏనే దొరకలేదంటే పార్టీ పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది.  తన నామినేషన్లలో మొత్తం పార్టీ ఎంఎల్ఏల సంతకాలనే చేయించుకోలేని వర్ల వైసిపి ఎంఎల్ఏలు ఆత్మప్రభోదం మేరకు తనకు ఓట్లు వేయాలని పిలుపివ్వటం క్యామిడిగా లేదూ ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: