ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఎన్నికల పోరు జోరందుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా  మోగడంతో ఒక్కసారిగా ఆంధ్ర రాజకీయాలు అన్ని వేడెక్కాయి. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత వచ్చిన మొదటి ఎన్నికలు కావడంతో... గతంలో ఓటమితో నిరాశ చెందిన ప్రతిపక్ష పార్టీలన్నీ ఈసారి ఎలాగైనా విజయం సాధించి సత్తా చాటాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాయి. ఇక అటు అధికార వైసీపీ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురు లేదు అని చెప్పాలి. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇన్ని రోజుల వరకూ వైసీపీ సర్కార్ చేపట్టిన పాలనకు ఎన్నికలు నిలువుటద్దంగా మారనున్నట్లు  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

 

 

 అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టిడిపి నేతలను వైసిపి నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కడం తో పాటు పలు ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు టిడిపి నేతలను వైసిపి వర్గీయులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం.. మరోవైపు మద్యం డబ్బు పంచకుండా గెలవాలని ఒకవేళ మద్యం డబ్బు పంపిణీ చేస్తే అనర్హత వేటు వేస్తామని జైలుకు పంపుతాము అంటూ వైసీపీ సర్కార్ పెట్టిన నిబంధన ప్రస్తుతం టిడిపి నేతలను వెనకడుగు వేసేలా  చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా చోట్ల టిడిపి నేతలు ఎవరు పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదు. 

 

 

 ఈ నేపథ్యంలో చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ కార్పొరేషన్లలో ఏకగ్రీవం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ మున్సిపాలిటీ కార్పొరేషన్ల నామినేషన్ల దాఖలు ప్రక్రియ నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో 93 డివిజన్లు, వార్డుల్లో వైసీపీ మాత్రమే నామినేషన్లను దాఖలు చేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఏకగ్రీవం అయిపోయింది. గుంటూరు జిల్లా మాచర్లలో 31 వార్డుల్లో ... కడప జిల్లా పులివెందులలో 33 వార్డుల్లో .. చిత్తూరు జిల్లా పుంగనూరు లో 31 వార్డులకు గాను 14 చోట్ల వైసిపి మాత్రమే నామినేషన్ దాఖలు చేసింది. ఇంతే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా కేవలం వైసీపీ మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో భారీ మొత్తంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: