తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో ఆ పార్టీ నాయకుల ఆగ్రహం ఇంకా చల్లారినట్టు కనిపించడంలేదు. సొంత పార్టీ నాయకుడైన రేవంత్ మీద కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా విమర్శలు చేస్తూ ఉండటం తో కాంగ్రెస్ పరువు బజారున పడుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా జోక్యం చేసుకోకుండా,  మౌనంగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పులి, సింహం అన్నట్టుగా సోషల్ మీడియాలో కొంతమంది అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని, తాను విజిలేస్తే పదివేల మందికి తగ్గకుండా వస్తారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఇలా అందరికి వేల మంది అనుచరులు ఉన్నారంటూ జగ్గారెడ్డి చెప్పారు. తనతో పాటు కొంత మంది పార్టీ నాయకులు కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరతారంటూ కొంతకాలంగా ప్రచారం చేస్తున్నారని, అవన్నీ అసత్య కథనాలు అంటూ జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

 

IHG


రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ కోర్ కమిటీలో చర్చ నిర్వహించి చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ నీ ఒక్కడిదా అంటూ రేవంత్ ను ఉద్దేశించిజగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈయనే హీరో, ఈయనే పీసీసీ, ఈయనే ముఖ్యమంత్రి అన్నట్టుగా సోషల్ మీడియాలో కొంతమంది హడావుడి చేస్తున్నారని, ఆయన సీఎం ఎలా అవుతారని, పైసలు పెట్టాలి, ఉద్యమాలు చేయాలి, ఇలా అన్నీచేస్తేనే సీఎం అవుతారని ఆయన చెప్పారు. రేవంత్ అంత తీస్మార్ ఖాన్ అయితే, తెలుగుదేశం పార్టీలో ఉండి ఎందుకు చేసుకోలేకపోయారు ?  పార్టీ ఎందుకు మారారు ?  సొంత నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయారు ? అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. నాకు సీఎం కావాలని ఉంది. ఈ పీసిసి కావాలని ఉంది అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. పార్టీలో అందరికీ అన్ని కావాలని ఉంటుంది. కానీ దానిని డిసైడ్ చేసేది సోనియాగాంధీ అని రేవంత్ చెప్పారు. 

 

IHG


ఇప్పటికైనా తప్పుడు ప్రసారాలు మానుకోకపోతే ఢిల్లీకి వెళ్తా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని నేరుగా కలుస్తా, తక్షణమే పార్టీ రేవంత్ ను బయటకి పంపాలంటూ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పార్టీని ఏ విధంగా పైకి తీసుకురావాలో మాకు తెలుసు అని, ఆ బాధ్యతను తాము చూసుకుంటామని జగ్గారెడ్డి చెప్పారు. ఇక పార్టీ బాధ్యతలను తాము చూసుకుంటామని, హైకమాండ్ కు చెబుతామని జగ్గారెడ్డి చెప్పారు. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతా ఒకటిగా ఆయనపై మాటల దాడి చేస్తూ, ఆయనను ఇరుకున పెట్టె విధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో టిఆర్ఎస్ పార్టీలో ఆనందం కనిపిస్తోంది. తమ చేతికి మట్టి అంటకుండా సొంత పార్టీ నేతలే ఇప్పుడు రేవంత్ ను విమర్శిస్తుండడం తమకు బాగా కలిసి వస్తుందని టిఆర్ఎస్ అగ్ర నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: