చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇది చైనాలోనే కాగా ప్రపంచదేశాలకు విస్తరించింది. కాగా., ఇప్పుడు ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఇరాన్ లో ఉందని చెప్పవచ్చు. అయితే.. ఇప్పటివరకు  ప్రపంచ దేశాలలో లక్షకు పైగా కరోనా బాధితులు ఉన్నట్లు తెలిసింది. అయితే.. భారతదేశ శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ మూలాలను సమర్ధవంతంగా వేరుచేశారు. ఆలా ఇప్పటివరకు వేరు చేసిన జాబితాలలో భారత్ 5 వ స్థానంలో ఉంది. భరత్ కన్నా మొదటగా ఈ వైరస్ మూలాలను చైనా, జపాన్, థాయ్‌ లాండ్, అమెరికా గుర్తించారు. 

 

కోవిడ్‌ వైరస్ ను వేరు చేసారు అంటే దాని అర్ధం..  మన మానవ శరీరంలో ఉన్న కరోనా వైరస్ నమూనాలను శాస్త్రవేత్తలు గుర్తించి వాటిని వేరు చేశారు. ఇది వైరస్ ను పూర్తిగా నిర్ములించడంలో ఇది మొదటి విజయమని పేర్కొనవచ్చు. ఎందుకంటే.. ఈ వైరస్ వ్యాక్సిన్, చికిత్స, నిర్ధారణ కిట్స్‌ ను అభివృద్ధి చేయడానికి సహకరిస్తుందని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్)  డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ్ అన్నారు. ఈ వ్యాధి వ్యాప్తికి కారణమైన వైరస్‌ ను వేరుచేయడం అంత ఈజీ కాదని ఆయన పేర్కొన్నారు. 

 

కాగా., ఇప్పటి వరకు కోవిడ్ 19కు నివారణ మందు లేదని, అలాగో ఆ వ్యాధిని ఆపే శక్తి ఏ వ్యాక్సిన్ కి కూడా లేదని తెలిసిందే.. ప్రస్తుతం కరోనా బాధితులకు హెచ్ఐవీ రోగులకు ఉపయోగించే లుపీనవీర్, రిటోనవీర్‌ను వినియోగిస్తున్నారని,  ఇలా చికిత్సలో భాగంగా జైపూర్‌ లో చికిత్స పొందుతున్న ఇటలీ దంపతులకు వారి అనుమతితో ఈ ఔషధాలను వినియోగిస్తున్నారని తెలిపారు. కాగా., బాధితులు ప్రస్తుతం కోలుకుంటున్నారనీ, తర్వలోనే వారికి సరైన చికిత్సను అందుబాటులోకి తెస్తామని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 

 

 

అయితే.. శాస్త్రవేత్తలు వైరస్ మూలాలు గుర్తించడానికి 21 మంది గొంతు, ముక్కుల నుంచి నమూనాలు సేకరించారని కాగా.. వీరిలో 11 మందికి వైరస్ నిర్ధారణ అయింది. నిర్ధారణ అయిన వారిలోంచి వైరస్ మూలాలను వేరు చేశామని తెలిపారు. మరి ఈ వైరస్ ఒక డ్రగ్ వైరస్‌ కు వ్యతిరేకంగా పనిచేస్తుందా..??  లేదా వ్యాధిని వేగంగా నిర్దారించే కిట్‌లను అభివృద్ధి చేయవచ్చా అనే అంశాలపై శాస్త్రవేత్తలు పరీక్షించే అవకాశం ఉందన్నారు. ఎబోలా వైరస్ వ్యాప్తి చెందినప్పుడు దీనికి మెడిసిన్ గా రెమిడిసివర్ ను అందించారని, ఈ రెమ్‌డెసివిర్ ఆరోగ్యకరమైన కణాలకు వైరస్‌ ను వ్యాపించకుండా చేస్తోంది. అయితే.. శాస్త్రవేత్తలు ఇప్పుడు కరోనా చికిత్సలో లుపీనివిర్, రిటోనివిర్‌ ను ఐఎఫ్ఎన్ బేటాతో కలిసి లేదా వేర్వేరుగా ఉపయోగించడం పై పరీక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: