సొంతూరున్న నియోజకవర్గం చంద్రగిరిలో సొంత పార్టీ నేతలే చంద్రబాబునాయుడుకు షాక్ ఇచ్చారు. నియోజకవర్గంలోని 95 ఎంపిటిసిల్లో 76 స్ధానాల్లో ఏకగ్రీవాలయ్యాయి. ఏకగ్రీవాలైన ఎంపిటిసి స్ధానాలన్నీ వైసిపి ఖాతాలోనే పడటం గమనార్హం. మిగిలిన 19 స్ధానాల్లో ఏమి జరుగుతుందో చూడాల్సుంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఏ స్ధాయిలో గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే. ఇపుడు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో అని స్ధానికులు నిజంగా భయపడ్డారు.

 

అయితే ఎవరూ ఊహించని విధంగా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ విధమైన గొడవ జరగలేదని సమాచారం. వైసిపి ఖాతాలో పడిన 76 ఎంపిటిసి స్ధానాల్లో కూడా గొడవలు జరిగిన దాఖలాలు లేవు. తెలుగుదేశంపార్టీ నుండి ఎటువంటి పోటి లేకపోవటంతోనే ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. చంద్రబాబు సొంత ఊరైన నారావారిపల్లెలో కూడా ఎన్నిక వైసిపికి అనుకూలంగా ఏకగ్రీవమైపోయినట్లు సమాచారం. పోటి కూడా లేకుండానే టిడిపి నేతలు ఎన్నికల నుండి ఎదుకు తప్పుకున్నట్లు ?

 

ఎందుకంటే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఈ పథకాలు కూడా మెజారిటి జనాలకు, మెజారిటి సామాజికవర్గాలకు అందుతున్నాయి. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలున్నప్పటికీ మెజారిటి జనాలు మాత్రం హ్యాపీగానే ఉన్నారు. ఇటువంటి సంక్షేమ పథకాలు అందుకుంటున్న జనాల్లో టిడిపి పార్టీకి చెందిన వాళ్ళ కుటుంబాలు, సానుభూతిపరులు కూడా ఉన్నారట. అంటే సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం  పార్టీలను చూడటం లేదని అర్ధమవుతోంది.

 

అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే తాను ఇచ్చిన హామీల్లో మెజారిటి పథకాలను జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తెచ్చేశాడు. చంద్రబాబు లాగ అవసరానికి హామీలిచ్చేసి తర్వాత తెప్ప తగలేయకుండా ఇచ్చిన హామీలకు కట్టుబడి అమల్లోకి తేవటంతో జనాలు కూడా సానుకూలంగా ఉన్నారు. కాబట్టి తాము పోటి చేసిన ఉపయోగం ఉండదన్న విషయం టిడిపి నేతలకు బాగా అర్ధమైపోయింది. అదే సమయంలో చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడూ జనాల్లోనే తిరుగుతుంటాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే అక్కడ వాలిపోతాడు. ఈ కారణం వల్లే జనాల్లో చెవిరెడ్డికి తిరుగులేని ఆధరణుంది. కాబట్టి వైసిపితో పోటి పడటం అనవసరం అనే టిడిపి నేతలు పోటికి దిగలేదని సమాచారం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: