క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. లేకపోతే స్ధానిక సంస్ధల ఎన్నికల నామినేషన్ల ఘట్టంపై చంద్రబాబు, టిడిపి నేతల ఆరోపణలు, విమర్శలను జనాలెవరూ పట్టించుకోవటం లేదంటే ఏమిటర్ధం ?  ఏమిటంటే ముందుగా చెప్పుకోవాల్సింది చంద్రబాబు క్రెడిబులిటి గురించే. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఎప్పుడూ క్రెడిబులిటి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మాటలకు చేతలకు ఎక్కడా పొంతనుండదు.

 

ప్రత్యర్ధులపై చంద్రబాబు ఎప్పుడు చూసినా అబద్ధాలు చెబుతు బురద చల్లేస్తుంటాడు. చంద్రబాబు దారిలోనే టిడిపి నేతలందరూ నడుస్తుంటారు కాబట్టి ప్రత్యర్ధులు బాగా ఇబ్బంది పడేవారు. అయితే కొంతకాలం అయిన తర్వాత చంద్రబాబు అండ్ కో చేసినవన్నీ అబద్ధపు ఆరోపణలే అని తేలిపోయేవి. కానీ ప్రత్యర్ధులకు ఈ మధ్య కాలంలో జరిగే డ్యామేజి మాటేమిటి ?  పచ్చమీడియా మద్దతుంది కాబట్టి దశాబ్దాల పాటు చంద్రబాబు తనదైన స్టైల్లోనే రాజకీయాలను నెట్టుకొచ్చేశారు.

 

అయితే గడచిన ఐదేళ్ళల్లో చంద్రబాబు రాజకీయం తిరగబడుతోంది. ఎందుకంటే చంద్రబాబు చెప్పే మాటలు, చేసే ఆరోపణలు పూర్తిగా అబద్ధాలే అని నిరూపితమైపోతోంది. సోషల్ మీడియా ఎప్పుడైతే స్పీడయిపోయిందో అప్పటి నుండే పచ్చమీడియా రాతలను జనాలు నమ్మటం మానేశారు. తాజాగా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో చంద్రబాబు, పచ్చమీడియా ఆరోపణలను జనాలు నమ్మటం లేదన్న విషయం రుజువైపోయింది.

 

స్ధానికసంస్ధల ఎన్నికల్లో ప్రతిపక్షాల నేతలను నామినేషన్లు వేయనీయటం లేదంటూ చంద్రబాబు, టిడిపి, పచ్చమీడియా నానా యాగీ చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. కానీ వాస్తవం ఏమిటి ? ఏమిటంటే ఎంపిటిసి, జడ్పిటిసి స్ధానాలకు దాదాపు వైసిపి తరపున ఎన్ని నామినేషన్లు పడ్డాయో టిడిపి తరపున కూడా కొద్దిపాటి తేడాతో అన్ని నామినేషన్లు పడ్డాయి. జడ్పిటిసిలైతే తేడా 400, ఎంపిటిసిలకైతే తేడా 4 వేలు మాత్రమే. ఈసి రిలీజ్ చేసిన లెక్కలతో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. ఇటువంటి చేష్టలతోనే చంద్రబాబు తన క్రెడిబులిటి మొత్తం పొగొట్టుకున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: