ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా కరోనా ముచ్చటే నడుస్తుంది.  కరోనా గురించి మొన్నటి వరకు చైనాలోనే భయపడేవారు.. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రజలు ఈ పేరు వింటే కంపించి పోతున్నారు.  ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ తో 5 వేల మంది మృతి చెందిన విషయం తెలిసందే. ఎంతో మంద ఈ భారిన పడి ఆసుపత్రుల పాలయ్యారు.  భారత్ లో ఇప్పటికీ కరోనాతో ఇద్దరు మృతి చెందారు.  కరోనా ఎఫెక్ట్ చైనా తర్వాత ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీలో ఎక్కువగా కనిపిస్తుంది.  అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. దేశ వ్యాప్తంగా వ్యాధి వ్యాప్తి చెందుతున్న సందర్బంగా ప్రభుత్వం అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నారు. ఈ కరోనా ఎక్కవగా విదేశీయుల నుంచి వస్తుందన్న విషయం తెలిసిందే.

 

ఇప్పటికే కేంద్రం వీసాలపై ఆంక్షలు విధించింది. తెలంగాణలో మరో కరోనా కేసు నమోదు అయ్యిందన్నారు.  ముంబై, బెంగుళూరు, పూణె వంటి నగరాల్లో అన్ని స్తంభించాయన్నారు.  ఢిల్లీలో ఇప్పటికే స్కూల్స్ మూసివేసిన విషయం తెలిసిందే.  కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ లో పాఠశాలలు, కళాశాలలు, మాల్స్, థియేటర్లు, పర్యాటక కేంద్రాలు అన్నీ మూసివేసినట్లు ప్రకటించారు.  ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ఇవాళ సాయంత్రానికి కీలక నిర్ణయం తీసుకుంటుందన్నారు.  ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

 

సాయంత్రం 6 గంటలకు తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో  స్కూల్స్ మూసివేయాల వద్దా ? లేదా దాని ప్రత్యామ్నయాం ఏమైనా ఉంటుందా అని చూస్తున్నారు. కేబినెట్ భేటీలో దీనిపై ఓ అవగాహన వస్తుందన్నారు. మాస్క్‌లు అన్ని సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. రోగులకు వైద్యం చేసే డాక్టర్ల కోసం కూడా ప్రత్యేక మాస్క్‌లు అవసరం అవుతాయన్నారు. కరోనా ఇబ్బంది ఎదుర్కొంటానికి రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: