కరోనా ఎఫెక్ట్ దెబ్బకు  తెలంగాణాలో కూడా విద్యా సంస్ధలను మూసేస్తారా ? పరిస్ధితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఎందుకంటే స్వయంగా  ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో కేసియారే ప్రకటించారు కాబట్టి. కరోనా సమస్య-పరిష్కారంపై ఇప్పటికే హై లెవల్ కమిటిని నియమించినట్లు చెప్పారు. కమిటి సమావేశం జరుగుతోందని సాయంత్రం తనకు ఓ నివేదిక ఇస్తుందని కూడా అన్నారు. దాన్ని బట్టి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని సభలో ప్రకటించారు. సాయంత్రం క్యాబినెట్ సమావేశంలో విద్యా సంస్ధలను మూసివేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

 

మొత్తానికి కేసియార్ కరోనా విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లే ఉంది. కరోనా వైరస్ అన్నది మెల్లి మెల్లిగా దేశమంతా వ్యాపిస్తోంది. ముందు కేరళలో మాత్రమే కనిపించిన ఈ వైరస్ ఇపుడు ఢిల్లీ, ఒడిస్సా, కర్నాటక, ముంబాయ్, చెన్నైలో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది.  దేశం మొత్తం మీద ఇప్పటి వరకూ సుమారు 85 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.

 

ఇక హైదరాబాద్ లో గుర్తించిన కరోనా వైరస్ బాధితుడు కర్నాటకకు వెళ్ళిన తర్వాత మరణించటం సంచలనంగా మారింది. అలాగే రెండో బాధితుడిని కూడా అధికారులు గుర్తించారు. రెండో బాధితుడు ఇటలీ నుండి తిరిగి వచ్చిన వ్యక్తిగా గుర్తించారు. ఇటలీలో వైరస్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. కరోనా వల్ల ఒక్క శుక్రవారమే ఇటలీలో సుమారు 250 మంది మరణించటం సంచలనంగా మారింది. దాంతో రెండో బాధితుడు కూడా ఇటలీ నుండే వచ్చాడని తెలియగానే ప్రభుత్వం అప్రమత్తమైంది.

 

ఇక హైదరాబాద్ లో ఉండే సినిమా ధియేటర్లు, షాపింగ్ మాల్స్ తదితరాలను మూసేస్తేనే మంచిదని ప్రభుత్వం ఆలోచిస్తోందట. ధియేటర్ల మూసివేతపై ప్రభుత్వం గనుక ఆదేశాలు జారీ చేస్తే వెంటనే మూసేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ధియోటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు ప్రకటన చేయటం గమనార్హం. కరోనా వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటమే మేలని కేసియార్ భావిస్తున్నారు. ఏదేమైనా సాయంత్రం జరిగే క్యాబినెట్ సమావేశంలో  ఏ విషయం తేలిపోతుంది లేండి.

మరింత సమాచారం తెలుసుకోండి: