ప్రపంచంలో ఉన్న దేశాలలో ఏ దేశాల పేర్లు దాదాపుగా ఒకదానినొకటి పోలిలేవు.. కానీ ఈ కోరియాల రెండింటికి చాలా దగ్గరి పోలికలున్నాయి.. అదేమంటే ఉత్తర కోరియా.. దక్షిణ కోరియా.. ఇందులో దక్షిణ కోరియా ప్రపంచంలో ఉన్న దేశాలతో పోలిస్తే ఒక మోస్తారుగా అభివృద్ధి చెందుతుంది.. ఈ దేశం పారిశ్రామిక ఉత్పత్తులు, వ్యాపార రంగంలో మిగతా దేశాలతో పోటీపడుతూ, అందివచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటూ.. ఆర్ధికప్రగతిని సాధిస్తుంది.. ఇక ఈ కోరియా నుండి విడిపోయిన ఉత్తర కోరియా రాచరిక పాలనలో, నియంతృత్వ ధోరణితో ముందుకు వెళ్లుతుంది..

 

 

ఈ దేశ ప్రజలందరు ఈ దేశ అధ్యక్షుడైన కిమ్ చెప్పుచేతల్లో ఉంటూ, ఆయన కనుసైగతో బ్రతికేస్తున్నారు.. ఒకవేళ కిమ్ చెప్పినట్లుగా ఎవరైన వినకపోతే వారి తలలు నరికేయడమో, లేదా నిర్ధాక్షిణ్యంగా కాల్చివేయడమో చేస్తాడు.. మొత్తానికి కిమ్ ఒక నియంత అని ప్రపంచానికంత తెలుసు.. ఇక కరోనా వైరస్ ఉత్తరకోరియాను తాకినప్పుడు అది సోకిన వ్యక్తులను కాల్చేయమని చెప్పాడంటే కిమ్ ఎలాంటి వ్యక్తో అర్ధం అవుతుంది.. అలాగే అమెరికా వంటి దేశాలకు కూడా కిమ్ ధీటుగా సమాధానం చెప్పాడు.. ప్రపంచ దేశాల ఆంక్షలను కాదని ఈ అధ్యక్షుడు అణుపరీక్షలను నిర్వహించాడు..

 

 

ఇంతకాలం ఎవరికి భయపడని ఈ కిమ్ ని మాత్రం కరోనా వైరస్ భయపెట్టి అతన్ని అజ్ఞాతంలో బ్రతికేలా చేసిందట.. ఒకరకంగా భయపడి పారిపోయేలా చేసిందంటున్నారు.. ఇక ఇతను ఎక్కడున్నాడో కేవలం ఆ ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు అధికారులకు మాత్రమే తెలుసట.. ఇక ఇప్పటికే ఈ దేశ రాజధానిలో కరోనా వచ్చింది కాబట్టి తాను ఇక్కడే ఉంటే ఈ వైరస్ తన ప్రాణాలను తీస్తుందనే భయంతో సముద్రతీర ప్రాంతంలో ఒక ఐసోలేటెడ్ వార్డు నిర్మించుకుని అందులో నుండే తన పాలన సాగిస్తున్నాడట..

 

 

ఇక ఇప్పటివరకు చంపడం మాత్రమే తెలిసిన కిమ్ తాను అనారోగ్యం పాలైతే తనను చంపి రాజ్యాధికారాన్ని వేరేవారు చేజిక్కించుకుంటారనే భయంతో ఇలా భయపడి పారిపోయాడని అనుకుంటున్నారట.. మొత్తానికి భయం అంటే తెలియని ఉత్తరకోరియా అధ్యక్షుడు కిమ్ ను ఈ కరోనా వైరస్ విపరీతంగా భయపెడుతుందన్న మాట.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: