ప్రస్తుతం భారతదేశంలో కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే . కేంద్ర ప్రభుత్వం సహా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కరోనా వైరస్  మాత్రం శరవేగంగా వ్యాప్తి  చెందుతుంది . భారత్లో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి . ఇప్పటికే భారత్ నుండి విదేశాలకు వెళ్లే విమానయాన సంస్థలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఏప్రిల్ 15 వరకు విదేశీయులకు భారత్ కి వచ్చేందుకు వీసాలను అనుమతించబోమని అంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం  చేసింది. విదేశాల నుంచి వస్తున్న వారికి కరోనా  సోకడం కారణంగా భారతదేశంలో కూడా కరోనా  వైరస్ కేసులు ఎక్కువైపోతున్నాయని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

 

 

 అంతే కాకుండా మరెన్నో కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపడుతుంది.ఇక కరోనా  వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు ఎన్నో ప్రత్యేక చర్యలు చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పటికే భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 60కి పైగా నమోదైన విషయం తెలిసిందే. ఇక ఈ కరోనా  తెలంగాణ వరకు చేరుకుంది.తెలంగాణలో కూడా కరోనా  వైరస్ కేసులు నమోదు అవుతున్న  విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ప్రాణభయంతో వణికిపోతున్నారు.

 

 

 ఈ క్రమంలోనే  తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కేసిఆర్ సర్కార్. విదేశాల నుంచి భారతీయులు ఇండియా కి వస్తే.. వారిని 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని.. ఆ తరువాత వారికి కరోనా వైరస్ సోకలేదు అని నిర్ధారణ అయిన తర్వాతనే బయటకు వదులుతామూ  ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. ఇక ఈ విషయంపై ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్ కమిటీ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరోనా  వైరస్ తెలంగాణ లోకి ప్రవేశిస్తే తామందారం సర్వ  శక్తులొడ్డి  కరొనా ను ఎదుర్కొంటామూ  అంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: