ప్రస్తుతం ప్రపంచం మొత్తం, ఎక్కడ చూసుకున్నా... ఎటువైపు విన్న.. కరోనా.. కరోనా.. కరోనా.. ఇక   తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ గురించి సీఎం కెసిఆర్ కొన్ని కీలక ప్రకటనలు చేసారు. వాస్తవానికి ఈనెల 20వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ ఫోబియాతో అసెంబ్లీ సమావేశాల్ని ఈరోజుతో ముగించాలని తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. 

 

ఇక దీనిపై అసెంబ్లీ సమావేశంలో కెసిఆర్ చర్చిస్తూ.. కరోనా వైరస్ సోకిన 65 మందిలో 17 మంది విదేశీయులేనని తెలిపారు. వీరిలో 10 మంది కరోనాను జయించగా, ఇద్దరు చనిపోయారు అని కేసీఆర్ కీలక ప్రకటన చేసారు. హైదరాబాద్ లో కరోనా వ్యాపించిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నివారణ మార్గాలకోసం ప్రభుత్వం అన్ని విధాలా.. కృషి చేస్తుందని... ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని అభయమిచ్చారు.

 

అయితే తాజాగా హైదరాబాద్‌లో కరోనా వైరస్‌తో కర్నాటక వాసి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తుంది. ఇటీవల వైద్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఈ విషయంపైన దీర్ఘ చర్చలు జరిపారు. ప్రభుత్వం హై అలర్ట్ అవ్వాలని అటు కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. ఇటు అసెంబ్లీలో దీనిపైనే ఎక్కువ చర్చలు జరుగుతున్న వాతావరణం కనబడుతుంది. కర్నాటక నుంచి వచ్చిన కల్ బర్గి వాసి తెలంగాణలో చాలామందిని కలిసాడని, ఆయా వివరాలు తెలుసునే పనిలో ఒక టీమ్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. 

 

ఇక ఇలాంటి వాతావరణంలో అసెంబ్లీలో కీలకమైన ద్రవ్య వినమయ బిల్లు ఆమోదం చర్చలు జరగవనే తెలుస్తున్నది. దీని కోసం మరోసారి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశమై బిల్లు ఆమోదించాల్సి ఉంటుందని పలువురు రాజకీయ ఉద్దండుల విశ్లేషణ. ఏది ఏమైనా హైజీన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, ఇటు ప్రభుత్వాలు, అటు ఆరోగ్య నిపుణులు ప్రజలకు పదే పదే సూచిస్తున్నారు. ఇది పెళ్లిళ్ల సీజన్ కనుక, నలుగురిలో తిరిగేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించవలసిందిగా సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: