క‌రోనా ఎఫెక్ట్‌తో తెలంగాణ ప్ర‌భుత్వం హై ఎలెర్ట్ అయ్యింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం ఎన్నో జాగ్ర‌త్తలు తీసుకుంటోంది. ఈ రోజు సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు ఏం చేయాల‌నే దానిపై ప‌లు సూచ‌న‌లు చేయ‌డంతో పాటు ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌నే విష‌యాలు కూడా చెప్ప‌డంతో పాటు లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇక ఇప్ప‌టికే శంషాబాద్ ఎయిర్ పోర్టులో 200 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. ఇప్ప‌టికే అక్క‌డ 108 వాహ‌నాల‌ను ఐదు సిద్ధం చేశారు. విదేశాల నుంచి వ‌చ్చిన వారిని వెంట‌నే అనంత‌గిరిలోని ఐసోలేష‌న్ వార్డులో అడ్మిట్ చేస్తారు.



ఇప్ప‌టికే 108లో ఉన్న వైద్య సిబ్బందికి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని 108 వాహ‌నాల‌ను క‌రోనా బాధితుల‌ను త‌ర‌లించేందుకు వాడాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలంగాణ‌లో రోజు రోజుకు క‌రోనా అనుమానితులు ఎక్కువ అవుతున్నారు. ఇక గాంధీ ఆసుప‌త్రి వ‌ర్గాల ద్వారా ఇప్ప‌టికే అక్క‌డ ఏకంగా 34 మంది క‌రోనా బాధితులు చికిత్స పొందుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక క‌రోనాకు బ్రేకులు వేసేందుకు తెలంగాణ‌లో ఇప్ప‌టికే హైలెవ‌ల్ క‌మిటీ ఏర్పాటు చేశారు.



మ‌రోవైపు అనంత‌గిరికి వ‌చ్చిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌తినిధులు ఐసోలేష‌న్ వార్డులు కూడా ప‌రిశీలించారు. ఇక ఈ రోజు సాయంత్రం దీనిపై కేబినెట్ స‌బ్ క‌మిటీ కూడా భేటీ కానుంది. తెలంగాణ‌లో ఈ రోజు లేదా రేప‌టి ఉద‌యం నుంచి అన్ని థియేట‌ర్లు, షాపింగ్ మాల్స్ బంద్ చేసేలా కూడా సీఎం నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని తెలుస్తోంది. ఇక ఇప్ప‌టికే క‌రోనా దెబ్బ‌తో అంద‌రూ భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. ఇప్పుడు ఎక్కువ మంది క‌లుసుకునే థియేట‌ర్లు, షాపింగ్ మాల్స్ కూడా మూసివేస్తే వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఉంటుంద‌ని భావిస్తున్నారు. అదే జ‌రిగితే సినీ ప్రియుల‌కు, షాపింగ్ ప్రియుల‌కు పెద్ద షాకే అనాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: