దేశంలో ప్రస్తుతం కరోనా సంగతి రోజురోజుకి ఎలా వ్యాప్తి చెందుతుందో మనం సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికికారణం నిన్నటి వరకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా 80 మందికి పైగా పాజిటివ్ కేసులు, అందులో 2 మరణాలు... ఇవి చాలు దేశంలో పరిస్థితి చెప్పడానికి. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడానికి చాలా మంది చాలా సూచనలు ఇస్తున్నారు .

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

My Lyft driver created this airtight seal in his car. If anyone out there is doing Lyft or uber for work, you may consider doing this to protect yourself and others. Just wanted to post this so you can see how one guy is helping keep himself and others safe

A post shared by Phil Ring Does Everything (@phildoeshair) on


కాకపోతే ఈ విషయంలో ఒక అమెరికన్ క్యాబ్ డ్రైవర్ కొత్త ఆలోచన చేసాడు. కరోనా వైరస్ సోకకుండా తనకారులో ప్లాస్టిక్ కవర్లతో ఏకంగా తన సీటు చుట్టూ ఒక కంపార్ట్మెంట్ నే  నిర్మించుకున్నాడు. ఈ విధంగా చేయడం వలన తన వాహనాల్లో కరోనా వైరస్ సోకినా వ్యక్తులు ఎక్కి ప్రయాణించినప్పటికీ అతనికి ఏమి కాదు అని నమ్మకంగా చెబుతున్నాడు. అయితే ఈ విషయాన్ని అందరికి తెలుపుటకు ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లతో సపరేట్ చేసి తన సీట్ చుట్టూ ఏర్పాటు చేసుకున్న కంపార్ట్మెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసాడు. దీనితో ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

IHG


నిజానికి ఇలా చేయడం వలన ఈ వీడియో ఇతరులకు ప్రయోజనం చేకూర్చేలాగా ఉంది. ఈ విధంగా అన్ని క్యాబ్, టాక్సీ డ్రైవర్లు కూడా అనుసరించాలని తాను కోరాడు. ఈ విధంగా చేయడంతో కరోనా భాదితుల నుంచి వేగంగా వ్యాపించే అవకాశం ఉండదు కాబట్టి. నిజానికి ఇలా కొత్తగా ఆలోచించడంతో నెటిజనులు ఈ వీడియో పోస్ట్ చేసిన అతనిని తెగ మెచ్చుకుంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే విదంగా ఉంటే అది అందరికి మంచిదే కదా..! 

మరింత సమాచారం తెలుసుకోండి: