అమ్మాయిల వసతి గృహాల్లోకి అబ్బాయిలు దూరటం ఇప్పుడు ట్రెండ్ అని చెప్పాలి. గత నెలలో ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఈ ఘటన తెలంగాణలో కూడా జరిగింది. చదువుకునే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మన రాష్ట్ర గవర్నమెంట్ ఈ వసతి గృహాలను ఏర్పాటు చేసింది. వసతి గృహంలో సెక్యూరిటీ గార్డ్, హాస్టల్ లో వార్డెన్లు ఉంటారు. ఇంకా హాస్టల్స్ లో అమ్మాయిల భద్రత పరంగా గేట్స్ కు తాళాలు కూడా వేస్తారు. వీటన్నింటిని దాటుకుని హాస్టల్ లో అబ్బాయిలు చొరబడటం చర్చంశనీయంగా మారింది. అయితే.. మరి ముఖ్యంగా సెక్యూరిటీ, వార్డెన్లను దాటుకుని వారు లోపలికి ఎలా పోతారనేది ప్రశ్నార్థకంగా మారింది.

 

 


అయితే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థినులకు వసతి గృహాల్లో భద్రత లేకుండా పోయిందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన విద్యను అందించటం కోసం ఏర్పాటు చేసిన గృహాల్లో ఏం జరుగుతున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు విద్యార్ధినుల తల్లిదండ్రులు. అసలు విద్యార్థినుల రక్షణ చర్యలు అధికారులు గాలికొదిలేశారనే ఆరోపణలు బానే వినిపిస్తున్నాయి. రాత్రి పూట యువకులు గదుల్లోకి దూరుతుండటంతో విద్యార్థినులు భయాందోళనలకు గురవుతున్నారు. 

 

 

 

నార్నూర్‌ మండలం ఆదర్శ బాలికల వసతి గృహంలోకి ఓ యువకుడు  విద్యుత్ సరఫరా నిలిపివేసి వెంటిలేటర్‌ ద్వారా గదిలోకి చొరబడ్డారు. అయితే ఆ యువకుడు రాత్రి అంతా బాలికల గదిలో ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆ యువకుడు రాత్రి మొత్తం హాస్టల్ గదిలో గడపటం చర్చంశానీయమైంది. అబ్బాయిని గదిలోకి రానించిన అమ్మాయిలను సస్పెండ్ చేశారు యాజమాన్యం. గృహంలోకి చొరబడిన యువకుని పై పోలీసులకు ఫిర్యాదు అందించారు.

 

 

 
కోమరం భీమ్ జిల్లా కెరమెరి మండలంలోని ఝరి గిరిజన ఆశ్రమ బాలికల వసతి గృహంలో ఇలాంటి సంఘటన చోటచేసుకుంది. ఈ వసతి గృహంలో 600మందికి పైగా ఉంటున్నారు. రాత్రి సమయంలో వసతి గృహంలోకి ముగ్గురు యువకులు చొరబడ్డారు. ఇది గమనించిన విద్యార్థినులు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హాస్టల్ సిబ్బంది వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై అధికారులు స్పందించి బాలికల వసతి గృహాలకు హస్టళ్లకు రక్షణ కల్పించాలని విద్యార్థినులు వారి తల్లదండ్రులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: