ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి కరోనా కేసు నమోదు అయ్యే సమయానికి మూడు రోజులు కాగా మొదట్లో ప్రజలంతా దీనిని ఒక రూమర్ అనుకున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మహమ్మారి దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలోనే మొదటి కేసు నమోదు కావడంతో చుట్టుపక్క ఏరియాల్లో ఉన్న ప్రజలంతా ఇప్పుడే పెట్టె బేడా సర్దుకుని బయటకు వెళ్లిపోతున్నారు. కలెక్టర్ కూడా సినిమా హాల్లను మరియు షాపింగ్ మాల్స్ ను కొద్ది రోజుల వరకూ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

 

అయితే ఒక నెల్లూరు లోనే కాకుండా ఇప్పుడు తిరుపతి లో కూడా వైరస్ దెబ్బకు ప్రజలంతా హడలిపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. ఇదిలా ఉండగా వేరే రాష్ట్రాల నుంచి అక్కడికి రావాల్సిన ప్రజలు కూడా వారి ప్రయాణాన్ని మానుకుంటున్నారు. ఇక వాణిజ్యపరంగా కూడా ఎన్నో కొత్త చిత్రాలు విడుదల కావాల్సిన వాయిదా పడడంతో రాష్ట్ర ఆర్థిక స్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది. అంతేకాకుండా కరోనా భయంతో ఇప్పటికే ఎగ్జామ్స్ కూడా కొన్ని వాయిదా పడగా స్థానిక ఎన్నికలు కూడా వాయిదా వేసే యోచనలో ఉంది ప్రభుత్వం.

 

అంతే కాకుండా దేశం మొత్తం క్రికెట్ మ్యాచ్ లు రద్దు చేయడం మరియు ప్రముఖ నగరాల్లో షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉండే పబ్లిక్ ప్లేసెస్, థియేటర్లు, అత్యవసర సమావేశాలు అన్నీ ఒకసారి ఆగిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఒక్క చికెన్ రేటు తగ్గడం మాత్రం మినహాయించి ఉన్న నిత్యావసరాల వస్తువుల రేట్లు కొద్దికొద్దిగా పెరుగుతూ ఉండడం మరియు విషయానికైనా కరోనా ను సాకుగా చూపించి ప్రజలను దోచుకోవడం కూడా మొదలైపోయింది. కరోనా బారిన పడిన ప్రతి 100 వ్యక్తుల్లో కేవలం ముగ్గురు మాత్రమే చనిపోతుంటే ఆర్థిక పరంగా మాత్రం వైరస్ రాష్ట్రంలోని ప్రజలందరినీ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: