నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో పార్టీ సమావేశంలో పవన్ కల్యాణ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.  నేను ఓ సినీ నటుడుని.. నా కెరీర్ బాగానే సాగుతుంది.. కానీ జనం కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి వచ్చాను.  ఇప్పుడు ఉన్న రాజకీయాలు ఎలాంటివో నాకు తెలుసు.. నిజాలు నిర్భయంగా మాట్లాడుతా.. నన్ను ఎవరైనా చంపుతారన్న భయం నాకు ఎప్పటికీ లేదు..రాదు అన్నారు.  నేను పార్టీ పెట్టినపుడు నాతో ఏ మేధావీ లేరు.. కానీ ధైర్యమే నా ఆయుధంగా పార్టీ పెట్టి ముందుకు నడిచాను అన్నారు.  అప్పట్లో నాతో కొన్ని కులాల వారు పార్టీని కలిసి నడిపిద్దామా అని ముందుకు వచ్చారు.. కానీ నేను వారితో ఏకీభవించలేదు.

 

కేవలం యువతను వారి ధైర్యాన్ని నమ్మి పార్టీ పెట్టాను.  నాకు తెలుసు నేను పార్టీ పెట్టినపుడు నాతో వచ్చే కొంతమంది అదును చూసుకొని పక్కపార్టీలోకి పోతారని.. ఒక్క అరుపు అరిస్తే పారిపోతారు.. అంతటి పిరికి వారు అయిపోయారు ఈ సమాజంలో  నాకు అలాంటి వారు అవసరం లేదు  అని పవన్ తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని బెదిరింపులు వచ్చానా గుండె ధైర్యంతో ముందుకు సాగే నాయకులే నాకు కావాలి అన్నారు.  గతంలో రాజమండ్రిలో నేను కవాదు చేస్తున్న సమయంలో పదిలక్షల మంది నాతోకలిసి వచ్చారు. కానీ ఎన్నికల సమయంలో వారు ఎవరికి ఓటు వేశారో వారికే తెలియాలి. 

 

తాము నేరాలకు పాల్పడేవారికి వేశారు.. ఓటమిని అంగీకరించడం ఎంత కష్టమో నన్ను అడగండి చెబుతాను' అని చెప్పారు.  నేను ప్రజల కష్టాలు చూశారు.. వారి ఆవేదన విన్నాను.. అలాంటి వారికి ఎప్పుడూ తోడుగా ఉంటాను.  ఓటమిని ఎదుర్కోవాలంటే చాలా బలమైన భావజాలం కావాలి. ఓటమిని అంగీకరించి నిలబడాలి. నేరస్తులను ప్రోత్సహించని రాజకీయాలు చేయాలి. కల్లబొల్లి మాటలు చెప్పి రాజకీయాలు చేయడం నాకు చేతకాదు అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: