భారత దేశంలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ.. కొంతమంది నీచుల వల్ల ఆ పవిత్ర బంధానికి రానురాను విలువ లేకుండా పోతోంది. పెళ్లి అనే బంధం ఇప్పుడు ఒక అవసరానిగా మారిపోయింది. పెళ్లి చేసుకునేది ఒకరినైతే ఉండేది ఒకరితో.. ఇలా మన ప్రాచీన విలువలను మంటల్లో కలుపుతున్నారు. అలా వారు వారి సంతోషం కోసం చేసే ఒక్క పనివల్ల వారి కుంటుబాలు.. వారి కుటుంబసభ్యుల జీవితాలను మంటల్లో కలిపేస్తున్నారు. పెళ్ళాం అందంగా లేదని, పిల్లలు పుట్టట్లేదని, నచ్చలేదనే కారణాలతో వారి భార్యలను వదిలించుకున్నారు భర్తలు. భార్యల విషయానికొస్తే వారు తక్కువేం కాదండోయ్.. కట్టుకున్న భర్త చిన్న చిన్న విషయాల్లో ఏమన్నా అన్న సర్దుకుపోవాలి. కానీ.. ఈ తరం మహిళలు అలా లేరు. అలా సర్దుకపోకపోతే నష్టపోయేది ఎవరండీ..?? అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందో మీరే చూడండి..

 

 

మహమ్మద్ షకీల్ మన్సూరీ అనే వ్యక్తి గుజరాత్‌ లోని వడోదరా పరిధిలోని యాకుత్‌పురాలో నివసిస్తూ.. ఆటో గ్యారేజ్ ను నడిపిస్తున్నాడు. అయితే.. మన్సూరీకి గతంలోనే వివాహం జరిగింది. కానీ.. అతనికి పిల్లలు పుట్టలేదన్న కారణంతో రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన అత్త కూతురైన ఇరమ్ కొన్ని కారణాల వల్ల ఆమె భర్తకు దూరంగా వారి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆ మహిళకు పెళ్లి అయిందని తెలుసుకుని కూడా ఆ ఆమెపై మనసు పారేసుకున్న మన్సూరి ఆ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం కూడా గత నవంబర్‌ లోనే జరిగింది. పెళ్లయిన 4నెలలకే అత్త కూతురు కనిపించకోవడంతో షాక్ కు గురయ్యాడు. 

 

 

 

తన రెండో భార్య ఇరమ్ కనిపించకుండా పోవడంతో మన్సూరీ చుట్టుపక్కల,  బంధువుల ఇళ్లలో వెతికాడు. అయినా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె ఇంట్లోనుంచి వెళ్లిపోతూ ఇంట్లో ఉన్న లక్ష రూపాయల విలువ చేసే బంగారు నగలు, సుమారు రూ.1.2 లక్షల నగదును ఎత్తుకెళ్లిపోయింది ఇరమ్. ఆమె ఎవరితోనో కారులో వెళ్తున్నట్లు చూశామని స్థానికులు చెప్పడంతో ఆమెకు ఫోన్ చేశాడు.  కానీ..ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. 

 

 

 

మన్సూరీ అనుకున్నట్లుగానే ఇరమ్ మొదటి భర్త అయిన సల్మాన్ షాబుద్దీన్‌ తో లేచిపోయినట్లు నిర్ధారించుకున్నారు. తర్వాత వారిరువురు ఇండోర్‌ లో ఉన్నట్లు గుర్తించి మన్సూరీ అక్కడికి వెళ్లారు. తన భార్య వద్దకి వెళ్లి మన్సూరీ ఇంటికి వెళ్దామని కోరాడు. కానీ..  ఆమె నా మొదటి భర్త అయిన షాబుద్దీన్ ను విడిచి రానని, తనంటే ఇరమ్ కు చచ్చేంత ప్రేమని చెప్పడంతో మన్సూరీ షాక్ కు గురయ్యాడు. ఎంత బ్రతిమాలినా రావటానికి ససేమీరా అనటంతో  ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మన్సూరీ పోలీసులను ఆశ్రయించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: