కరోనా వైరస్ చిన్నపిల్లలకి సంక్రమించకుండా తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలను ఎన్నో దేశాల వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇటీవల కరోనా వైరస్ మహమ్మారి నుంచి పిల్లల్ని సంరక్షించేందుకు పాటించవలసిన సూచనలను బ్రిటన్ వైద్య నిపుణులు తెలియపరిచారు. భారతదేశంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా పెరిగిపోతుంది కాబట్టి మనం కూడా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం. అందుకే బ్రిటిష్ వైద్య నిపుణులు ఎటువంటి సూచనలను ఇచ్చారో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.




నిజం చెప్పాలంటే చైనాలో వందమందికి కరోనా వైరస్ సోకితే... ఆ వంద మందిలో కేవలం ఇద్దరి కంటే తక్కువ పిల్లలే ఉన్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఒకవేళ చిన్న పిల్లలకు కరోనా వైరస్ సోకినా... వారు చనిపోవడం అస్సలు జరగదు. కరోనా వైరస్ సోకినా పిల్లలలో వ్యాధి లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. కాకపోతే మీ పిల్లలకి కరోనా వైరస్ సోకితే మీకు కూడా ఆ వైరస్ వెంటనే సోకే ప్రమాదం ఉంది. మీ ఇంట్లో పెద్దలు ఉంటే వారికి ఈ వైరస్ వెంటనే సంక్రమిస్తుంది. దాంతో వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. పిల్లలు ఒక చోట ఉండరని కొత్తగా చెప్పనక్కర్లేదు. వాళ్లు స్నేహితుల ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారు, ఇంకా ఆడుకుంటూ వేరే చోటకి తిరుగుతూ అన్ని ముట్టుకుంటుంటారు. బయట ప్రదేశాలలో తుమ్ముతూ, దగ్గుతూ ఉన్నవారికి దగ్గరగా వెళ్తుంటారు కూడా. ఇటువంటి సందర్భాల్లోనే వారికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే సాధ్యమైనంతవరకు జలుబు చేసిన వారి వద్దకు మీ పిల్లలను పంపించకండి.

 



ఒకవేళ మీ పిల్లలు బయట ప్రదేశాలకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వెంటనే ఒక సబ్బు ఇచ్చి 20 నిమిషాలపాటు చేతులు కడిగించండి. ఇంటి తలుపులు, గొళ్ళాలు, ఇతర మెటల్(ఇనుప) వస్తువుల ఉపరితలంపై కరోనా వైరస్ ఎక్కువకాలం బతకగలదు. అందుకే మీ పిల్లలు వాటిని పొరపాటున ముట్టుకున్నా... ముట్టుకున్న చేతులతోనే ముఖాన్ని తాకినా... వైరస్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే వాళ్ల చేతులను 20 నిమిషాలపాటు శుభ్రంగా కడిగించండి. చేతులతో ముఖాన్ని తాకే అలవాటును మాన్పించండి. ఒకవేళ మీ పిల్లలకు దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత రుగ్మతలు వస్తే వారిని వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్ళండి. పిల్లలు ఎవరైనా విదేశాల నుండి వచ్చిన వారి ఇంటి ముందు ఆడుకునే వస్తే వారికి కరోనా వైరస్ సోకే అవకాశం ఉంటుంది కాబట్టి మీ పిల్లలపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించండి. 14 రోజుల వరకు మీ పిల్లలను ఏకాంతంగా ఉంచండి. 14 రోజుల తర్వాత మీ పిల్లల లో ఎటువంటి కరోనా వైరస్ లక్షణాలు కనిపించక పోతే వాళ్ళకి వైరస్ సోకనట్లే భావించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: