దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 2014 ఎన్నికల టైం నుండి వరుసపెట్టి అపజయాల మీద అపజయాలు రావటంతో దాదాపు దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా జాతీయ కాంగ్రెస్ లో నాయకత్వ లోపం ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చాలామంది రాజకీయ విశ్లేషకుడు కామెంట్ చేస్తున్నారు. చాలా మంది సీనియర్లు వయసు మీద పడిన వాళ్ళు అదేవిధంగా ఎన్నో పదవులు అనుభవించిన వాళ్ళు ఇంకా కూడా పార్టీలో ఉన్న యువ రక్తానికి చోటివ్వకుండా గ్రూపు రాజకీయాలు చేయడం వల్లే ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ మహా సంక్షోభం నెలకొందని టాక్ వినపడుతోంది. ముఖ్యంగా దేశ రాజకీయాలలో ఇంకా సోనియాగాంధీ పార్టీలో ఉన్న అహ్మద్ పటేల్, గులాం నబి అజాద్, చిదంబరం, దిగ్విజయ్ సింగ్ వంటి నాయకుల పై ఆధారపడి వారి సలహాలు పాటించడం నిజంగా దురదృష్టకరమని పార్టీలో ఉన్న నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

సోనియాగాంధీ నమ్ముకున్న సీనియర్ నాయకుల వల్లే దేశంలో కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది..దీంతో ఆ పార్టీని ఆదుకునే నాథుడే ప్రజెంట్ లేరని కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న వాళ్లు అంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పటినుండో నమ్మకం గా పనిచేస్తున్న యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ని దూరం చేసుకోవడం అతి పెద్ద తప్పు అని పైగా ఇటువంటి టైములో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు దారుణం గా వ్యవహరించారని అన్నారు.

 

అప్పట్లో వైఎస్ కుమారుడు వైయస్ జగన్ ని ఏ విధంగా దూరం చేసుకున్నారు అదే విధంగా జ్యోతిరాదిత్య సింధియా ని కూడా దూరం చేసుకున్నారని...కాంగ్రెస్ పార్టీకి నమ్మకం గా పనిచేసిన కుటుంబాలను సోనియాగాంధీ దగ్గర సలహాలు ఇస్తున్న సీనియర్ లే దూరం చేస్తున్నారని ఇదే పరిస్థితి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కొనసాగితే మాత్రం….ఎన్నికలలో కాకుండా మామూలుగానే కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అవ్వటం గ్యారెంటీ అనే టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా జాతీయస్థాయిలో సరైన నాయకత్వం లేకపోవటం సోనియాగాంధీ నిస్సహాయతకి నిదర్శనం అనే టాక్ బలంగా వినబడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: