ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల చివరి లోపు స్థానిక సంస్థల ఎన్నికలు అవ్వ కొట్టకపోతే కేంద్రం నుండి రావలసిన కొన్ని వేల కోట్లు నిధులు ఆగిపోతాయని ఏపీ సర్కార్ కి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం అయింది. అధికారంలో ఉన్న వైసిపి మరియు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు నామినేషన్ల విషయంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ హడావుడి సృష్టించారు.

 

ముఖ్యంగా మాచర్లలో తెలుగుదేశం పార్టీ నాయకుల పై వారి ప్రయాణం చేస్తున్న కారుపై ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది కర్రతో కారులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ లాయర్ తల పగలగొట్టడం ఆ వీడియోలు బయటకు రావటం తో అధికార పార్టీపై విమర్శలు దారుణంగా వచ్చాయి. అదే టైంలో టిడిపి అధినేత చంద్రబాబు ఈ దాడులను ఖండిస్తూ గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇదే తరుణంలో కేంద్రంలో ఉన్న అధికారులకు కూడా రాష్ట్రంలో వైసిపి వ్యవహరిస్తున్న తీరును చేస్తున్న దాడులను గురించి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఒకపక్క దాడులు మరోపక్క ఇప్పుడు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బయం పట్టుకోవడంతో ఏపీలో గందరగోళ వాతావరణం నెలకొంది.

 

ముఖ్యంగా ఈ వైరస్ ఒకరి నుండి ఒకరికి... చేతులు ముట్టుకున్నా గాని అంటువ్యాధులు సోకే లక్షణాలు కలిగి ఉండటం తో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంల మిషన్ల పై కాకుండా బ్యాలెట్ పేపర్ విధానంలో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈవీఎంల మెషిన్ లపై అయితే ఒక్కరు టచ్ చేసిన బటన్ పైన మరొకరు టచ్ చేస్తే కరోనా వైరస్ వ్యాధి సోకే అవకాశం ఉండటంతో ఎన్నికల సంఘం బ్యాలెట్ పద్ధతి నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: