కాంగ్రెస్ పార్టీలోన గత కొంత కాలంగా పీసీసీ పదవిపై అంతర్లీనంగా వాడి వేడి చర్చ జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీన పడిందని, అందువలన వీలైనంత త్వరగా కొత్త చీఫ్‌ని తీసుకోవాలని కొందరు నేతలు హైకమాండ్ వద్ద పలుమార్లు ప్రస్తావించారు. అంతే కాకుండా, తమకే ఆ పదవిని కట్టబెట్టాలని పలువురు నేతలు సోనియా, రాహుల్ గాంధీకి విజ్ఞప్తులు చేశారు. 

 

అయితే, ఎవరికి వారు హైకమాండ్ వద్ద తమ ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. ఇక ఈ రేసులో ముఖ్యంగా... రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు పేర్లు ప్రధానంగా మనకు వినిపించేవి. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు. ప్రస్తుతం అవి పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని, జన్వాడలోని  కేటీఆర్ లీజుకు తీసుకొన్న ఫామ్ హౌస్ 111 జీవోకు వ్యతిరేకంగా నిర్మించారని రేవంత్ రెడ్డి  ఆరోపించారు.

 

ఇపుడు వీటిని వీటిని వేలెత్తి చూపుతూ.. "గోపన్ పల్లి వ్యవహారం బయట పడగానే జి.ఓ 111 గుర్తుకు వచ్చిందా రేవంత్ రెడ్డి??" అంటూ దుయ్యబట్టారు. ఎంపీ స్థాయిలో వున్న వ్యక్తి ఇలా వ్యహరించడం సరి కాదని అయన సూచించారు. చిన్న పిల్ల చేష్టలు మానుకోవాలని, ఒక పరిపూర్ణత కలిగిన రాజకీయ నాయకుడిలా ప్రవర్తించాలని ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డికి క్లాస్ తీసుకున్నారు.

 

ఇకపొతే, గోపన్ పల్లి భూముల విషయంలో.. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రేవంత్రెడ్డి మీద ఒకింత అసంతృప్తితోనే వున్నారని చెప్పుకోవాలి. తన వ్యక్తిగత  వ్యవహరాన్ని పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ చేస్తున్నాడని.. కొందరు సీనియర్లు బహిరంగంగానే మండిపడుతున్నారు. ఇక గోపన్ పల్లి భూముల వ్యవహరానికి కౌంటర్‌ చేసే ఉద్దేశ్యంతోనే, రేవంత్ రెడ్డి జన్వాడలో కేటీఆర్ పామ్ హౌస్ అంశాన్ని తెరమీదికి తెచ్చారని సదరు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: