ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఎదురు లేదు అనే చెప్పాలి. ఎన్నికలు జరిగిన పాలనలో అయినా తాము చెప్పింది శాసనంగా మారిపోతుంది. ఇక మొదటి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చాక అంతకు ముందు ఉన్న చరిత్రను తిరగరాసి... సంచలన రికార్డు సృష్టించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది టిఆర్ఎస్ పార్టీ. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు టిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత వస్తుంది అని టాక్  వినిపించినప్పటికీ... మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా మునుపెన్నడూ లేనివిధంగా ఘన విజయాన్ని సాధించింది. ఇంకొన్ని రోజుల్లో హైదరాబాద్ ఎన్నికలకు సిద్ధం అవుతుంది టిఆర్ఎస్ పార్టీ. 

 

 ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో  విద్యుత్ ఛార్జీలు పెంచుతాం..  పెంచక  తప్పదు అంటూ ప్రకటించారు. కేవలం 101 యూనిట్ లు  విద్యుత్ వాడిన వారికి మాత్రమే విద్యుత్ ఛార్జీలు ఉచితం అంటూ తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి  ఇచ్చే నిధులు తగ్గుతుండటంతో పాటు ఆర్థిక మాంద్యం వల్ల విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి  వస్తుంది అంటూ అధికార పార్టీ చెబుతోంది. 

 


 దీనిపై రాజకీయ విశ్లేషకులు మాత్రం మండిపడుతున్నారు. రెండు యూనిట్ల లోపు ప్రస్తుతం కడు పేదరికంలో ఉన్న వాళ్ళు తప్ప ఎవరూ 100 యూనిట్ల లోపు కరెంటును వాడారని.. ప్రస్తుతం ప్రతి ఇంట్లో టీవీ ఫ్రిజ్ లు  వచ్చినందున ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో 150 నుంచి 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పాలకులు విద్యుత్ ఛార్జీలు పెంచుతామని ఆలోచన వస్తే అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్రాన్ని దోచుకుంటారా అని ప్రశ్నించిన వారే  ఇప్పుడు అధికారంలోకి వచ్చాక.. విద్యుత్ చార్జీలు పెంచుతానని చెప్పడం ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ధోరణిలో వ్యవహరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై తెలంగాణ ప్రజానీకం ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: