ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  ఎన్నికల వేడి రాజుకున్న  విషయం తెలిసిందే. ఇంకొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తిని సంతరించుకున్నాయి. ఎన్నికల కోసం ఇప్పటికే అన్ని పార్టీలు సంసిద్ధం అయిపోయారు. తమదే  గెలుపు అంటూ ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల మధ్య సర్దుబాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ అధికార పార్టీ నామినేషన్ విషయంలో అత్యధిక అభ్యర్థులతో ముందు స్థానంలో ఉంది. 

 

 ప్రస్తుతం స్థానిక సంస్థలకు సంబంధించి ఓ  పోస్టింగ్ ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. టోటల్ గా నామినేషన్ వేసిన వారి సంఖ్యను ఈ పోస్టింగ్ లో  తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జెడ్పిటిసి స్థానాలు మొత్తం 652... మొత్తం నామినేషన్లు 4778... ఇందులో అధికార పార్టీ 1866, టీడీపీ 1413, బీజేపీ 433, కాంగ్రెస్ 368, జనసేన 270... అంటే సగటున ఒక జడ్పిటిసి స్థానానికి వైసీపీ తరఫున ముగ్గురూ టిడిపి తరఫున ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఎన్నికలు జరుగుతున్న ఎంపీటీసీ స్థానాలు 9696.. వీటికి గాను మొత్తం నామినేషన్లు 50, 064.. అంటే ఒక్కో ఎంపిటిసి అన్ని పార్టీల నుంచి ఐదు మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ 20121, టీడీపీ 18242, జనసేన 2027, బీజేపీ 1816 మంది నామినేషన్లు వేశారు. 

 

 సాధారణంగానే అధికార పార్టీ నుంచి ఎక్కువగా నామినేషన్లు వేస్తూ ఉంటారు.అదే స్థాయిలో  ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా అంతే స్థాయిలో నామినేషన్లు దాఖలు అవుతాయి... ఇక మిగతా చిన్న చిన్న పార్టీలు ఇండిపెండెంట్ నామినేషన్ కూడా దాఖలు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల నామినేషన్లు ఏకగ్రీవం అవుతూ ఉంటాయి. ఇది ఎన్నో రోజులనుండి కొనసాగుతూ వస్తోంది. ఇదే సమయంలో టిడిపి జనసేన అక్రమ సంబంధం అనే ఒక వీడియో ని కూడా చూపిస్తుంది వైసిపి పార్టీ. అయితే వాస్తవంగా వైసీపీ పార్టీతో సమ ఉజ్జీ అయిన టిడిపి పార్టీ ఎందుకు వైసీపీ తో సమానంగా నామినేషన్లు వేయలేకపోయింది.. అంటే బెదిరింపులు,  ఏకగ్రీవాల కారణంగానే ఇలా జరిగింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసి గెలిచి ఉంటే బాగుండేదని కానీ టీడీపీ నామినేషన్లు వేయకుండా అడ్డుకుని అక్రమంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: