కరోనా వైరస్ ప్రభావం భారతదేశంపై తీవ్ర స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. విదేశాల నుండి వస్తున్న ప్రజల వలన మన దేశీయులకు కరోనా వైరస్ సోకుతుందని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైన జాగ్రత్తలను తీసుకోమని ప్రజలకు సూచిస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ వలన రెండు మరణాలు సంభవించగా... 80 మందికి పైగా దీని బారిన పడి చికిత్స పొందుతున్నారు. క్రీడలు చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు కాబట్టి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం అన్ని క్రీడా కార్యక్రమాలు నిలిపివేసింది. ఇందులో సౌత్ ఆఫ్రికా- ఇండియన్ వన్డే క్రికెట్ మ్యాచ్ ని నింపి వేయడంతోపాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని వాయిదా వేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కరోనా వైరస్ గురించి సామాజిక మాధ్యమాలలో చెప్పుకొచ్చాడు.

 




ఆయన సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు చేస్తూ... 'ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ధైర్యంగా మనం కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కొందాం. సురక్షితంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోండి... అదేంటంటే చికిత్స కంటే నివారణ నయం. దయచేసి ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా చూసుకోండి' అని అన్నారు. శుక్రవారం నాడు విరాట్ కోహ్లీ ఒక నలుపు మాస్కు ధరించి లక్నో ఎయిర్ పోర్టులో కనిపించాడు.

 




ఇకపోతే శనివారం సాయంత్రం ఇండియన్ క్రికెట్ టీమ్ ట్రైనింగ్ సెషన్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ బీసీసీఐ, సౌత్ ఆఫ్రికా ఒకేలా ఆలోచిస్తూ ఈరోజు జరగాల్సిన వన్డే మ్యాచ్ ని రద్దు చేయాలని భావించాయి. ఎందుకంటే కరోనా వైరస్ భయంతో ఇరు దేశాల క్రికెటర్లు తమ ఇళ్లకు చేరుకోవాలని కోరారు. మాజీ ఇండియన్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా వైద్య నిపుణులు ఇచ్చిన సూచనలను తూచా తప్పకుండా పాటించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టమని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు చాలా మంది సెలబ్రెటీలు కరోనా వైరస్ ని తరిమికొట్టేందుకు ఎన్నో టిప్స్ ని తమ వంతుగా సామాజిక మాధ్యమాల ద్వారా తెలియపరిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: