సాధారణంగా మరణించిన వారి మృతదేహాలను సాంప్రదాయ బద్ధంగా ఖననం చేయాలనే ఆచారం ప్రతి మతంలో ఉంది.. అలానే చేస్తారు కూడా.. కానీ ఈ కరోనా అనే మాయదారి జబ్బు ఎవరిని ఎవరికి కాకుండా చేస్తుంది.. కుటుంబ బంధాలను ప్రేమలను సమాధి చేస్తుంది.. అయిన వాళ్లలో ఎవరైనా కరోనాతో చనిపోతే భయంతో వారి చివరి యాత్రకు కూడా వెళ్లలేని పరిస్దితులు తలెత్తుతున్నాయి.. కొన్ని చోట్ల అయితే అందరు ఉన్నా గానీ అనాధ శవంలా దహనం చేస్తున్నారు.. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇదే పరిస్దితి ఎదుర్కొంటుంది..

 

 

ఇకపోతే చైనా వాళ్లు చేసిన పనికి మాలిన పనివల్ల ప్రపంచం మొత్తం కష్టాల్లో పడిందన్న విషయం తెలిసిందే.. అయితే ప్రస్తుతం చైనాలో ఈ వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టగా.. ఇరాన్‌లో మాత్రం విజృంభిస్తోంది. ఇక ఇరాన్‌ ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకు 429 మంది మాత్రమే తమ దేశంలో చనిపోయారని చెబుతున్నా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనంగా ఇరాన్‌లో, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సమాధులు తవ్వుతున్నారట.. ఈ విషయాన్ని కొన్ని అంతర్జాతీయ మీడియా ఛానళ్లు వెలుగులోకి తెచ్చాయట..

 

 

కరోనా సమాధులు, ఇరాన్ రాజధాని టెహరాన్‌కు 145 కి.మీ. దూరంలోని కోమ్ సిటీ వద్ద తవ్వుతున్నారట. కరోనా వ్యాధితో మరణించిన మృతులను విడివిడిగా కాకుండా సామూహికంగా ఖననం చేస్తున్నారట.. కాగా 100 గజాల పొడవు ఉన్న ఈ సమాధులు అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని శాటిలైట్ చిత్రాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చూశారా ఖర్మకాండలు లేవు.. అయిన వాళ్ల చివరి చూపులు లేవు.. అనాధ శవాల్ల దహన సంస్కారాలు చేస్తున్నారు.. ఇంతకంటే దారుణమైన బ్రతుకులు ఏమైనా ఉన్నాయా.. ఏ జన్మల చేసుకున్న పాపాలో ఇలా వెంటాడుతున్నాయి.. అని అనుకుంటున్నారట.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: