టెక్నాల‌జీ ఎంత ఫాస్ట్‌గా అభివృద్ధి చెందుతుందో సైబ‌ర్ నేరాలు కూడా అంతే ఫాస్ట్‌గా అప్‌డేట్ అవుతున్నాయి. టెక్నాల‌జీ పెర‌గ‌డంతో వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌,  ఫేస్‌బుక్ ఇలా ర‌క ర‌కాల సోష‌ల్ మీడియాలో ఆడ‌పిల్ల‌లు త‌మ ఫొటోల‌ని షేర్ చేస్తూ ఉంటారు. వాటినే అలుసుగా తీసుకుని కొంత మంది ఆక‌తాయిలు ఎలాంటి నేరాలు చేయ‌డానికైనా వెన‌కాడ‌టం లేదు. ల‌గ్జరీ లైఫ్‌కి అల‌వాటు ప‌డిన యువ‌త నేడు చేసేవ‌న్నీ దాదాపుగా సైబ‌ర్ నేరాలే ఎక్కువ‌గా ఉంటున్నాయి. ఇటీవ‌లె ఇలాంటి సైబ‌ర్ నేరం ఒక‌టి వెలుగు చూసింది. 

 

వివ‌రాల్లోకి వెళితే...ఇత‌ని పేరు వెంక‌టేష్ సిఎ ఫైన‌లియ‌ర్ స్టూడెంట్‌. విజ‌య‌వాడ‌లో చ‌దువుకుని ఇటీవ‌లె హైద‌రాబాద్ శ్రీ‌రామ్‌న‌గ‌ర్ కాల‌నీలో వాళ్ళ బావ వాళ్ళ ఇంటిద‌గ్గ‌ర ఉంటూ చ‌దువుకుంటున్నాడు. ఈ యువ‌కుడు టిండ‌ర్ అనే ఓ డేటింగ్ యాప్‌ని కొత్త‌గా క్రియేట్ చేసి అందులో అంద‌మైన అమ్మాయిల ఫొటోలు డౌన‌లోడ్ చేసి వేరు వేరు పేర్ల‌తో చాటింగ్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. అంతేకాక ఆ చాటింగ్‌లో డ‌బ్బులు అడిగి వాళ్ళ‌ను మోసం చేసి త‌న అకౌంట్‌లో డ‌బ్బులు వేయించుకునేవాడు. అలా మోసంతో సంపాదించిన మొత్తం డ‌బ్బు 20ల‌క్ష‌లు వ‌ర‌కు తేలింది.

 

ఇక సీఎ పూర్త‌వ‌క‌ముందే ల‌క్ష‌లు సంపాదించాల‌నుకున్నాడు. దాంతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి సెక్స్‌ చాటింగ్‌ చేయాలంటే రూ.100, న్యూడ్‌ ఫొటోలు పంపాలంటే రూ.300, న్యూడ్‌ వీడియో కాలింగ్‌ చేయాలంటూ రూ.500 తన బ్యాంకు ఖాతాలో పంపాలని కోరేవాడు. దాంతో  అంగీకరించిన వారికి  త‌న  బ్యాంకు ఖాతా వివరాల‌ను ఇచ్చేవాడు. ఎవరైనా డబ్బు డిపాజిట్‌ చేయడానికి ముందు ఏమ‌న్నా కాస్త డ‌వుట్ వ‌చ్చి  ‘మగా, ఆడా?’ అంటూ సందేశం ప‌డితే మాత్రం వెంటనే ‘బై’ అంటూ వారిని కట్‌ చేస్తున్న‌ట్లు చాట్ చేసేవాడు. ఇలా పూర్తిగా త‌న వల‌లో వేసుకుని డబ్బుల‌ను ట్రాన్స్‌ఫర్ చేయించుకునేవాడు. ఇక మోస‌పోయిన‌వాళ్ళు విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌లేక చెపితే ఎక్క‌డ ప‌రువు పోతుందో అని సైలెంట్‌గా అలానే ఉండిపోయేవారు.

 

ఓ రోజు ఇలానే హైద‌రాబాద్‌కి చెందిన ఓ యువ‌తి ఫొటో తీసుకుని చాట్ చేశాడు. ఆ అమ్మాయికి అప్పుడే మ‌రో అబ్బాయితో నిశ్చితార్ధం అవ్వ‌గా. ఈమె ఫొటోతో ఓ ప్రొఫైల్‌ టిండర్‌లో ఉండ‌టం కాబోయే భర్త తరఫు వాళ్ళు చూసి ఎంగేజ్‌మెంట్ ని రద్దు. దీంతో ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. వెంట‌నే ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు దర్యాప్తు చేసి వెంక‌టేష్‌ని ప‌ట్టుకుని ఆరాతీశారు. దీంతో అస‌లు విష‌య‌మంతా బ‌య‌ట‌ప‌డింది. ఇక‌ ఈ విషయంపై సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు  సోషల్‌ మీడియాలో యువతులు త‌మ ఫొటోల‌ను పెట్ట‌డం ఎంత మాత్రం మంచిది కాదంటూ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: