ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి కంచుకోటలుగా కుప్పం, హిందూపురం నియోజకవర్గాలు ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి ఓటమి లేదు. అయితే 2019 ఎన్నికల ముందు వరకు ఈ రెండు నియోజకవర్గాల సరసన గుంటూరు జిల్లా పొన్నూరు కూడా ఉండేది. 2019 ముందు వరకు ఇక్కడ టీడీపీకి ఓటమి లేదు. ముఖ్యంగా  ధూళిపాళ్ల ఫ్యామిలీకు తిరుగులేదు.

 

1983, 1985, 1989 ఎన్నికల్లో వరుసగా ధూళిపాళ్ల వీరయ్య చౌదరీ టీడీపీ తరుపున వరుసగా గెలిచారు. ఇక వీరయ్య వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తనయుడు narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర పొన్నూరులో సత్తా చాటారు. 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి 2019 ఎన్నికల్లో డబుల్ హ్యాట్రిక్‌కు కొట్టాలని చూశారు. కానీ ఊహించని విధంగా ఆయన డబుల్ హ్యాట్రిక్ రికార్డుకు బ్రేక్ పడింది. వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్య, నరేంద్రకు చెక్ పెట్టేశారు. తొలిసారి నరేంద్రకు ఓటమి రుచి చూపించారు.

 

అయితే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రకు చెక్ పెట్టిన రోశయ్య, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చెక్ పెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే పొన్నూరు మున్సిపాలిటీతో సహ కొన్ని ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. దీంతో నియోజకవర్గంలోని మిగతా ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాలపై ఫోకస్ చేశారు. వీటిల్లో మెజారిటీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగరవేసి సత్తా చాటాలని అనుకుంటున్నారు.

 

కాకపోతే పొన్నూరులో ధూళిపాళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆయన ఏ సమయంలోనైనా సత్తా చాటే అవకాశముంది. నియోజకవర్గంపై ఆయనకు గట్టి పట్టు ఉండటంతో రోశయ్య వైసీపీని గెలిపించడం అంత సాధ్యమయ్యే పని కాదు. కానీ రోశయ్య వెనుక ఆయన మామ ఉమ్మారెడ్డి కూడా ఉన్నారు. ఉమ్మారెడ్డి సలహాలు తీసుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ధూళిపాళ్ళకు ఏ మాదిరిగా చెక్ పెట్టారో, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చెక్ పెట్టాలని అనుకుంటున్నారు. మరి చూడాలి పొన్నూరు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలం వస్తాయో?

మరింత సమాచారం తెలుసుకోండి: