ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడుతాయా. ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేద్దామను ఉవ్విళ్ళూరుతున్న వైసీపీకి గట్టి దెబ్బ పడబోతోందా. ఏపీలో విపక్షం గెలుస్తుందా. ఇంతకీ ఈ పంచాయతీ సమరానికి ముగింపు ఉంటుందా. లేక అర్ధాంతరంగా తెర పడుతుందా.

 

ఇవన్నీ సందేహాలు, ప్రశ్నలు. ఇంకా చెప్పాలంటే విపక్షాలు అచ్చం ఇదే కోరుకుంటున్నాయి. ఎందుకో  తెలియదు కానీ జగన్ ఇలా కుర్చీ ఎక్కాడో లేదో తెలియదు కానీ   ఎన్నికలు పెట్టడండి, అసెంబ్లీ రద్దు చేయండి, మళ్ళీ జనం తీర్పు కోరండి అంటూ లేచినది మొదలు పడుకునే వరకూ ఒకటికి పదిసార్లు చంద్రబాబు ఆయన మిత్రులైన ప్రతిపక్షాలు జగన్ సర్కాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

 

అయితే జగన్ మాత్రం కేంద్ర నిధులు అయిదు వేల కోట్ల రూపాయలు మురిగిపోతాయని లోకల్  బాడీ ఎన్నికలను ఒక్క దెబ్బకు అన్నీ జరిపించేస్తున్నారు. యుధ్ధ ప్రాతిపదికన అన్ని ఎన్నికలు జరిపిస్తే ఏపీలో స్థానిక పాలన మొదలవుతుంది. అపుడు నిధులు వస్తాయి. ఆ మీదట పల్లెలు కూడా బాగుంటాయి అన్న ఉద్దేశ్యంతో జగన్ ఎన్నికలు పెడితే వద్దు అన్న విపక్షమే తప్ప పెట్టాలి మేము రెడీ అన్న వారు ఒక్కరు కూడా  లేరు.

 


బీసీల రిజర్వేషన్లు పేరిట హైకోర్టులో మొదట  అడ్డుకున్నారు. మొత్తానికి పార్టీ రిజర్వేషన్లు పేరిట జగన్  బీసీలకు  ఏ రకమైన అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నారు. అయినా టీడీపీ దీనిమీద సుప్రీం కోర్టుకు వెళ్ళింది. అక్కడ పిటిషన్ ఉండగానే జగన్ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పించేశారు. సరే ఎన్నికల కధ మధ్యలో ఉంది. ప్రధానమైన నామినేషన్ ఘట్టం ఇప్పటికి  పూర్తి అయింది.

 

ఇక మరో వారంలో  ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మునిసిపాలిటీలు ఎన్నికలు పూర్తి అవుతాయి. అలాగే పంచాయతీ ఎన్నికలు చివర్లో ఉన్నాయి. ఇలా సాఫీగా కధ సాగుతూంటే ఇపుడు కరోనా భయాన్ని తెచ్చి అయినా ఎన్నికలు వాయిదా వేయించాలని విపక్షాలు చూస్తున్నాయట. జనం కరోనా వైరస్ తో చచ్చిపోతూంటే ఎన్నికలు పెట్టడమేంటి అంటూ  బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు గట్టిగానే విరుచుకుపడుతున్నారు.

 

ఇంకో వైపు టీడీపీ నాయకులు కూడా కరోనాతో దేశ‌మంతా ఆట్టుడుతూంటే ఇపుడు హఠాత్తుగా  ఎన్నికలు ఏంటి అంటూ అపుడే నిద్ర లేచిన వారి మాదిరిగా  చిందులు తొక్కుతున్నారు. ఇక బ్యాలెట్ పేపర్లను ముట్టుకున్నా కరోనా వ్యాపిస్తుందని కూడా చెబుతూ జనాలు ఓటింగులు రాకుండా అపుడే బెదిరించే ప్రొగ్రాం కూడా మొదలైపోయింది. 

 

ఇప్పటివరకూ ఎన్నికల రద్దు మీద   ఎవరెన్ని  చెప్పినా కూడా అవన్నీ రాజకీయ కారణాలు కాబట్టి జనం నుంచి రియాక్షన్ లేదు. అదే కరోనా వైరస్  అంటే జనం కూడా బాగానే  జడుసుకుంటారు.  మరిపుడు ఎన్నికలు వద్దు, రద్దు అంటే సర్కార్ ఇరకాటంలో పడినట్లే. మరి ఈ పది రోజుల్లో విపక్షం ప్రచారం ఏ లెక్కన సాగుతుందో. అసలు ఎన్నికలు జరపనిస్తారో  లేదో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: