చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ ప్రాణాంతక వైరస్ వలన వేలాది మంది ప్రాణాలు విడిచారు. అయితే.. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చైనీయులను కడిగి పారేశారు. ప్రపంచ వ్యాప్తంగా క్రీడా కార్యక్రమాలు చైనా దేశం వల్లనే రద్దయింది ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

 

 

 

చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్ లో క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయని కానీ.. అవి చూడటానికి స్థానిక ప్రజలు స్టేడియంకు రావటం లేదని ఇవన్నీ చూస్తుంటే.. నాకు చాలా భాధగా ఉందన్నారు. పీఎస్ఎల్ వల్ల తనకు తీవ్రమైన కోపం వస్తోందని అన్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీసీఎల్) లాహోర్ మ్యాచ్ ను, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ లను ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ లను నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో.. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ప్రేక్షకులు లేకపోవటంతో ఖాళీ స్టేడియంలో మ్యాచ్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

చైనాలో కరోనా పుట్టి అన్ని దేశాలకు వ్యాప్తి చెందినందున మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చైనీయుల ఆహారపు అలవాట్ల పై కామెంట్స్ చేశారు. అయితే.. వారు గబ్బిలాలను, పిల్లులను, కుక్కలను అసలు ఎలా తింటారని వాటి రక్తాన్ని ఎలా తాగుతారని.. వాటి మూత్రాన్ని అసలు ఎలా సేవిస్తారని తనకు నిజంగా అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.

 

 

అడ్డమైనవన్ని తినటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వైరస్ ను వ్యాపింపజేస్తున్నారని.. ప్రపంచ దేశాలను మొత్తం ఆపదలో పడేశారని, ప్రపంచం అంతా సంక్షోభంలో పడిందని, అలాగే.. పర్యాటర పరిశ్రమ పై  ఈ ప్రభావం తీవ్రంగా పడిందని ఆయన అన్నారు. నేను చైనా ప్రజలను ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నానని ఆయన గుర్తు చేశారు. తనకు చైనా ప్రజలపై ఎటువంటి కోపం లేదని, కేవలం జంతు ప్రవృత్తికి తాను వ్యతిరేకమని మాత్రమే అని ఆయన అన్నారు. ప్రతి జంతువును తింటే ఇలాగే సంక్షోభానికి గురి అవ్వాల్సి వస్తుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: