మనమేదో పెద్ద తోపులం అనుకుంటాం కానీ.. మనం చాలా అమాయకులం.. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాం.. కాకపోతే.. ఆ చెప్పేవాడు కాస్త నమ్మకంగా చెప్పాలంతే. కానీ ఇలాంటి విషయాలు మన కొంపలు ముంచుతాయి. మనకూ, మన ఆప్తులకు గొడవలు పెట్టాలనుకునేవారు.. మన ఆప్తులపై మనకు లేనిపోనివి కలిపి చెప్పే ప్రమాదం ఉంది.

 

 

అయితే వారు అతి జాగ్రత్తగా ఆ విషపు మాటలు ఎక్కిస్తారు. వాటిని మనం గుర్తించకపోతే.. జీవితంలో చాలా నష్టపోతాం. ఇలా చెప్పుడు మాటలు విని స్నేహాన్ని కోల్పోయిన వారు కొందరు ఉన్నారు. అలాగే చెప్పుడు మాటలు విని సంసారాలని నాశనం చేసుకున్నవారు మరికొందరు ఉన్నారు.

 

 

ఇక చెప్పుడు మాటలు విని అధికారాన్ని కోల్పోయిన వారూ చరిత్రలో ఎందరో ఉన్నారు. శకుని చెప్పుడు మాటలు వినటం వలన హస్తినాపుర మహా సామ్రాజ్యమే సర్వనాశనం అయింది ఇక మనమెంత? మనతో ఉంటూ చెప్పుడు మాటలు చెప్పే శకుని లాంటి వాళ్ళతో అప్రమత్తం గా లేకపోతే ఎంతటివారికైనా అపజయం తప్పదు.

 

 

ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఒకరి గురించి నీకు చెబుతున్నాడు అంటే నీ గురించి మరొకరికి చెప్పడా ? అందుకే జీవితంలో ఎప్పుడైనా మన సొంత అవగాహన మనకు ఉండాలి. అంతే కానీ ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మేయకూడదు.. ప్రభావితం కాకూడదు. ఎవరైనా ఏదైనా చెప్పినా.. దానిలో మంచి చెడు బేరీజు వేసుకోవాలి. ఏమంటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: