ప్రపంచ దేశాలకు పట్టిన పీడ కరోనా వైరస్.. దీని బాధ ఎప్పుడు తొలుగుతుందా అని ఎదురుచూడని మనిషి లేడు.. ఈ వ్యాధి బారిన పడిన వారు కొందరు శ్మశానంలోకి వెళ్లుతుంటే, మరికొందరు కోలుకుని తమ ఇంటికి వెళ్లుతున్నారు.. ఇక కోలుకుంటున్న వారికంటే మరణిస్తున్న వారే ఎక్కువ.. ఇప్పటికే కొన్ని లక్షల మందికి చుట్టుకున్న ఈ కరోనా ఇంకా ముందు ముందు ఎంత మందిని తన పొట్టన పెట్టుకుంటుందో అనే టెన్షన్‌తో నిదురలేకుండా చేస్తుంది..

 

 

అయితే కరోనా వైరస్ నుండి కోలుకున్న వారు సంతోషంగా ఉండటానికి వీలు లేకుండా ఇలాంటి వారికి మరో కొత్త సమస్య వచ్చిపడిందట.. అదేమంటే.. వ్యాధి సోకినవారు చాలామంది చికిత్స అనంతరం బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ వారి ఊపిరికే ఇతర సమస్యలు ఉత్పన్నమౌతున్నాయట. ఇది అందరి విషయంలో కాదట కొందరికి మాత్రం ఈ సమస్యలు వస్తున్నాయట.. ఇలా హాంకాంగ్‌లో పన్నెండు మంది కరోనా నుండి కోలుకోగా, వీరిలో ముగ్గురికి త్వరగా ఆయాసం - ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు వచ్చాయి. మిగిలిన తొమ్మిది మందికి స్కాన్ చేయగా వారి ఊపిరితిత్తుల్లో చీలికలు ఎక్కువగా కనిపించాయని తెలిసిందట..

 

 

ఇకపోతే ఈ వ్యాధి సోకి నయమైనప్పటికీ ఊపిరితిత్తుల పనితీరు ఇరవై శాతం నుండి ముప్పై శాతం వరకు తగ్గిందట. వ్యాధి నుండి బయటపడినప్పటికీ కొంతమంది ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు హాంగ్ కాంగ్ వైద్యులు గుర్తించారట. ఇక సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం ఇలాంటి వారు కాస్త వేగంగా నడిస్తే ఊపిరి తీసుకోవడంలో ఇతరుల కంటే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారట..

 

 

ఐతే వారు హృదయ సంబంధ వ్యాయామం చేయడం ద్వారా వారి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అంటే ఈత వంటివాటి ద్వారా క్రమంగా మెరుగుపడవచ్చు అన్న మాట... ఇదిలా ఉండగా భారత్ లో కరోనా వైరస్ కేసులు 84కు చేరుకున్నాయి. కాగా ఇకముందు ఈ వైరస్ ఎంతమందిపై తన ప్రభావాన్ని చూపిస్తుందోనని ప్రజలు భయపడిపోతున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: