విశాఖ జీవీఎంసీ ఎన్నికలు ఇపుడు ఏపీవ్యాప్తంగా చర్చగా ఉన్నాయి. అతి పెద్ద నగరంగా విశాఖ ఉండడమే కాదు, కాబోయే రాజధాని కాబట్టి అందరి చూపూ ఇటువైపే ఉంది. ప్రజలు ఏ రకమైన తీర్పు చెబుతారు అన్నది కూడా ఆసక్తిగా ఉంది. అదే విధంగా విశాఖ సిటీలో ఇప్పటివరకూ వైసీపీని ఆదరించిన దాఖలాలు లేవు. ఇపుడు విశాఖ ప్రజలు వైసీపీని ఎలా అదరిస్తారు. ఎంత మెజారిటీ ఇస్తారు. ఇవన్నీ కూడా చర్చలే చర్చలు.

 

ఇవన్నీ ఒక ఎత్తు అయితే అపుడే పదవుల పంపకంలో వైసీపీ నేతలు ఉన్నాయి. విశాఖ మేయర్ మనదే అన్న ధీమాతో ముందుకుపోతున్నారు. విశాఖ మేయర్ పదవిని బీసీలకు రిజర్వ్ చేశారు. దాంతో ఎవరు మేయర్ అవుతారో అన్నది జగన్ చేతిలోనే ఉంది. అకస్మాత్తుగా తెర మీదకు కొత్త పేరు కూడా రావచ్చు అంటున్నారు.

 

అలాగే డిప్యూటీ మేయర్ విషయానికి వస్తే దాన్ని కూడా జగనే డిసైడ్ చేయాలి. అయితే  మంత్రి అవంతి శ్రీనివాసరావు మాత్రం తన కుమార్తె ప్రియాంకను డిప్యూటీ మేయర్ గా చూడాలనుకుంటున్నారు. ఆయన ఏరి కోరి తెచ్చి మరీ తన కూతురికి టికెట్టు ఇచ్చేశారు. ఆమె రాకతో చాలా మంది ఆశలు గల్లంతు అయ్యాయి.

 

జగన్ ఓ వైపు బంధువులను ఎవరినీ బరిలోకి దించవద్దు అని చెబుతున్నా కూడా మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం తమ వారికి దగ్గరుండి టికెట్లు ఇప్పించుకున్నారు. దాంతో మంత్రి కూతురు వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఆమె గెలిస్తే డిప్యూటీ మేయర్ కిరీటమే నెత్తిన పెడతారు అని కూడా వినిపిస్తోంది.

 

 విశాఖలో అన్ని సీట్లూ గెలిపిస్తే ఎలాగూ అవంతి ఇమేజ్ ఒక్కసారిగా జగన్ వద్ద పెరుగుతుంది కాబట్టి ఆయన్ని కాదని జగన్ ముందుకుపోలేరని, దాంతో అవంతి కూతురు డిప్యూటీ మేయర్ అయిపోయినట్లేనని అపుడే టాక్ మొదలైంది. మరి చూడాలి ఎన్నికలు ముగిసేలోగా మరెంతమంది మేయర్లు, డిప్యూటీలు లిస్టులోకి వస్తారో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: