ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాజకీయాలు  ప్రతిరోజు వాడివేడిగా  జరుగుతున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు పై ప్రతీకారం తీర్చుకుంటు భారీ షాక్ లు  ఇస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే 2014 ఎన్నికల్లో టిడిపి పార్టీ గెలిచిన అధికారాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 67 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది వైసిపి పార్టీ. ఇక టీడీపీ అరాచకాలకు వ్యతిరేకంగా జగన్ ఎంతగానో పోరాటం చేశారు. ఏకంగా టిడిపి సర్కారును కూల్చే శక్తి తనకు ఉంది అంటూ జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను టిడిపి లోకి ఆహ్వానించి  ఏకంగా అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. దీనిపై జగన్ ఎంత పోరాటం చేసినా ఫలితం మాత్రం రాలేదు. 

 

 

 2019 ఎన్నికల్లో జగన్ గెలిచిన తర్వాత... తాము తలుచుకుంటే టీడీపీ ఖాళీ అయిపోతుందని... కానీ తమ ప్రభుత్వ హయాంలో పార్టీ ఫిరాయింపుల కు తావు లేదని పార్టీ మారాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. ఓ కండిషన్ పెట్టారు. అయినప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు వైసిపి వైపు వెళ్లేందుకు ఎంతగానో మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో టీడీపీ కీలక నేత వల్లభనేని వంశీ టిడిపి పార్టీకి రాజీనామా చేసి అసెంబ్లీలో తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్ కోరడంతో స్పీకర్ ఆమోదించారు. దీంతో అనర్హత మాట అనేది లేకుండా పోయింది. ఆలోచన ఆచరణ రెండు  మారిపోయాయి. 

 

 

 ఈ నేపథ్యంలోనే టిడిపి పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసిపి పార్టీ సానుభూతిపరులు గా మారిపోయారు. అధికారికంగా పార్టీలో చేరకపోయినప్పటికీ వాళ్ళు వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. ఇక మాజీలకు అయితే ఎలాంటి నిబంధనలు లేవు కాబట్టి భారీగానే వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే మద్దాల గిరి... తాజాగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. ఇదే ధోరణి అవలంబించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో  మరింతమందిని పార్టీలో చేర్చుకునేందుకు వైసిపి పావులు కదుపుతోంది. అయితే గతంలో వైసీపీ విషయంలో చంద్రబాబు అనుసరించిన వ్యూహాన్ని ప్రస్తుతం జగన్ అనుసరిస్తున్నారు. కానీ ఆచరణలో ఆలోచనలో  మాత్రం కాస్త మార్పు వచ్చింది అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: