చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పం. ఆ కుప్పం చంద్రబాబుకు కంచుకోట అన్న సంగతి తెలిసిందే. ఆయన అక్కడి నుంచి కొన్ని దశాబ్దాలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కుప్పానికి కొన్ని మంచి పనులు చేశారు. అలాంటి కంచుకోట ఇప్పుడు బీటలు వారుతోందా అనిపిస్తోంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ చంద్రబాబు మెజారిటీ గణనీయంగా తగ్గింది.

 

 

చంద్రబాబు సొంత నియోజక వర్గాన్ని టార్గెట్ చేసిన జగన్.. ఆయన సొంత గ్రామం సమీపంలోనే మూడు రాజధానులకు అనుకూలంగా సభ ఏర్పాటు చేశారు. అది చాలా వరకూ విజయవంతం కూడా అయ్యింది. అప్పుడే అది చంద్రబాబు కు ఘోర అవమానంగా రాజకీయ విశ్లేషకులు భావించారు. ఇప్పుడు అంత కంటే ఘోరమైన పరాభవం ఎదురైంది. అదేమిటంటే.. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఓటింగ్ కు ముందే విజయ భేరి మోగించింది.

 

 

మొత్తం కుప్పం నియోజక వర్గంలోని 95 ఎంపీటీసీ స్థానాలకు గాను 86 చోట్ల వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. దీంతో టీడీపీ నాయకులు షాక్ అయ్యారు. అధినాయకుడికి ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. మరోవైపు వైసీపీ ఏకగ్రీవాల హవా పలు జిల్లాల్లో కొనసాగింది.

 

 

వైయస్‌ఆర్‌ జిల్లాలో 50 జెడ్పీటీసీ గాను 35 చోట్ల , 805 ఎంపీటీసీ 150 స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లాలో 841 ఎంపీటీసీ స్థానాలకు గాను వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు 41 చోట్ల ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

 

విజయనగరం జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలకు గాను 3 చోట్ల వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. విశాఖ జిల్లాలో 39 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఒక చోట వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: