విశాఖపట్నం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అపరేషన్ టీడీపీ కి శ్రీకారం చుట్టింది . విశాఖ లో ఆ పార్టీ తరుపున నల్గురు ఎమ్మెల్యేలు విజయం సాధించగా , ముగ్గుర్ని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది . విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు తిరుగులేదని , ఏకపక్ష విజయం సాధించాలని ఆరాటపడుతున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక  నాయకత్వం, ఇప్పటికే పలువురు  ద్వితీయ శ్రేణి నేతల్ని  తమవైపు తిప్పుకోవడం లో సక్సెస్ అయింది .

 

ఇకపోతే టీడీపీ నగర అధ్యక్షుడిగా కొనసాగిన రెహ్మాన్ ఇప్పటికే ఆ పార్టీ కి గుడ్ బై చెప్పి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెల్సిందే . విశాఖ నగరానికి చెందిన ముగ్గురు టీడీపీ  ఎమ్మెల్యేలు కనుక వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరితే ,  కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ  కనీసస్థాయి లో  పోటీనిచ్చే అవకాశాలుండవని వైస్సార్ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి . రాష్ట్రం లో మూడు రాజధానుల ఏర్పాటు లో భాగంగా విశాఖను పరిపాలక రాజధానిగా ప్రకటించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన నేపధ్యం లో మేయర్ పీఠాన్ని ఏకపక్షంగా గెల్చుకుని  ఆయనకు కానుక గా అందివ్వాలని స్థానిక వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది . విశాఖ కార్పొరేషన్ ఎన్నికలను పార్టీ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తో పాటు , మంత్రి అవంతి శ్రీనివాస్ అన్ని తామై పర్యవేక్షిస్తున్నారు .

 

స్థానిక సంస్థల్లో ప్రతిచోటా 90 శాతం స్థానాలను గెలిపించాల్సిన బాధ్యతను మంత్రులు , ఎమ్మెల్యేలకు జగన్ అప్పగించడం తో , విశాఖ తో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలపైన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టి సారించింది . స్థానిక ఎన్నికల పోలింగ్ కు   ముందే టీడీపీ చేతులెత్తిసినట్లు కన్పిస్తుండడం తో ఏకపక్ష విజయం పై వైస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ధీమాగా ఉన్నాయి .  

మరింత సమాచారం తెలుసుకోండి: