సినిమా డైలాగులే కాదు.. రాజకీయాల్లోనూ కొన్నిసార్లు డైలాగులు బాగా పేలుతుంటాయి. ఒక్కోసారి నాయకులు టార్గెట్ గా కావాలనే డైలాగులు పేలుస్తుంటారు. మరోసారి అవి అనుకోకుండా సమయ స్ఫూర్తిగా వాగ్బాణాలు వదులుతుంటారు. అవి బాగా ట్రెండింగ్ అవుతుంటాయి. మరి ఈ వారం అలాంటి డైలాగులు ఏమున్నాయో ఓసారి చూద్దాం.

 

 

వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పెట్టబోతున్న హీరో రజినీకాంత్.. తన అభిమానులతో సమావేశమయ్యాడు. ఆ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ గెలిచినా తాను సీఎం కాదలుచుకోలేదన్నాడు. తాను పార్టీ అధ్యక్షుడిగానే ఉంటానన్నాడు.. తాను నాయకులను తయారు చేస్తానని.. సీఎం పదవిపై ఆశలేదన్న రజినీకాంత్ డైలాగ్ బాగా పేలింది.

 

 

ఇక ఏపీ రాజకీయాల్లోకి వస్తే.. ఈ వారం అత్యధిక సార్లు ప్రెస్ మీట్లు పెట్టిన ఘటన మాజీ సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. ఆయన స్థానిక ఎన్నికల సందర్భంగా రోజూ ప్రెస్ మీట్లలో దర్శనమిచ్చారు. వైసీపీ అరాచకాలు చేస్తోందన్న చంద్రబాబు.. పోలీసులు కూడా వారితో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏపీలో పోలీస్ టెర్రరిజం నడుస్తోందన్నారు చంద్రబాబు.

 

 

ఇక మరో విపక్ష నేత పవన్ కల్యాణ్ కూడా జగన్ పాలన, స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై మండిపడ్డారు. ఇక ఇలా ఎన్నికలు జరిగేటట్టయితే ఎన్నికలెందుకన్నారు.. ఏపీ స్థాయిని మరో బీహార్ లా మార్చేశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జనసేనతో జట్టు కట్టిన బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా సేమ్ టు సేమ్ అవే డైలాగులు వల్లించారు. వైసీపీ నాయకులు మద్యం, డబ్బు పంచినట్టు నిరూపిస్తే.. సీఎం పదవి నుంచి వైదొలగుతారా అంటూ జగన్ కు సవాల్ విసిరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: