రాజకీయాలు అంటే చాలా మంది ఓ సీరియస్ సబ్జక్టు అనుకుంటారు. కానీ అందులోనూ అంతులేని కామెడీ ఉంటుంది. వెదికి చూడాలే కాని.. నాయకుల ప్రకటనల వెనుక.. వారి రాజకీయ వ్యూహాల వెనుక నవ్వు పుట్టించే హాస్యం ఉంటుంది. ఎప్పుడూ సీరియస్ అంశాలే కాదు.. ఇలాంటి నవ్వు పుట్టించే సన్నివేశాల గురించి కూడా చెప్పుకుంటే బావుంటుంది. మరి ఈ వారం అలాంటి కామెడీ సన్నివేశాలు ఏమున్నాయో చూద్దాం..

 

మాజీ సీఎం చంద్రబాబు ఈ వారం స్థానిక ఎన్నికల నేపథ్యంలో రోజూ ప్రెస్ మీట్లు నిర్వహించారు. ఆయన వైసీపీ అరాచకం చేస్తోందంటూ మండిపడ్డారు. అయితే స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో.. స్థానిక రాజకీయాలు ఎలా ఉంటాయో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియంది కాదు. అయినా సరే.. ఆయన వైసీపీ మాత్రమే అరాచకాలు చేస్తున్నట్టు రోజూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తుంటే సీరియస్ ఇష్యూ కాస్తా కామెడీగా మారిపోయింది.

 

 

ఇక ప్రతి వారం కొత్త పలుకు ద్వారా తన విశ్లేషణ అందించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. ఈవారం అసలు చంద్రబాబు టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయడమే దండగ.. ఆయన ఎన్నికలకు దూరంగా ఉండటం బెటర్ అంటూ సలహా ఇవ్వడం మరో కామెడీగా మారింది. ఆయన విశ్లేషణపై మళ్లీ సోషల్ మీడియాలో విశ్లేషణలు వచ్చాయంటే అది ఏ రేంజ్ కామెడీ పీసో అర్థం చేసుకోవచ్చు.

 

ఇక ఏపీది కాకపోయినా మరో కామెడీ తెలంగాణ సీఎం కేసీఆర్ దని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా.. కరోనా గురించి ఆయన మాట్లాడుతూ.. అదో పెద్ద రోగం కాదు.. కరోనా వైరస్ మన టెంపరేచర్ వద్ద బతకదు. అయినా కరోనా వస్తే పారసిట్మాల్ గోలీ వేసుకుంటే అదే పోతది అంటూ చాలా తేలికగా మాట్లాడారు. అదే వారం తిరిగేసరికి తెలంగాణలో స్కూళ్లు, సినిమాహాళ్లు, షాపింగ్ మాళ్లు మూసేయాల్సిన పరిస్థితి. అప్పటి కేసీఆర్ డైలాగులు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: