ఓవర్ యాక్షన్.. ఈ పదం మనం నిజ జీవితంలో చాలా సార్లు వాడుతుంటాం. ఇక రాజకీయ నాయకులు కూడా ఏమీ తక్కువ తినలేదు. రాజకీయాల్లోనూ వారు కొన్నిసార్లు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. కానీ.. బ్యాడ్ లక్ ఏంటంటే.. ఆ ఓవర్ యాక్షన్ జనానికి తెలిసిపోతుంటుంది కూడా. కానీ కొంత మరి సీనియర్ రాజకీయ నాయకులు మాత్రం.. తమది ఓవర్ యాక్షన్ అనే విషయం తెలియకుండా తమ నటనాపటిమతో నెగ్గుకొస్తుంటారు. మరి ఈ వారం అలాంటి ఓవర్ యాక్షన్ ఏంటో చూద్దామా..

 

 

ఏపీలో స్థానిక ఎన్నికల సందడి ప్రారంభంకావడంతో ఈ వారం నాయకుల అతి మామూలుగా లేదు.. ఏ ఒక్క నాయకుడో అని చెప్పుకోవడానికి వీల్లేదు. అందులో కొన్ని వెదుక్కోవాలంటే.. మాచర్ల సంఘటన బాగా వైరల్ అయ్యింది. మాచర్లకు వెళ్లిన టీడీపీ నాయకులు బోండా ఉమ, బుద్దా వెంకన్నలపై వైసీపీ నాయకుడు ఒకరు కర్రతో చేసిన దాడి వైసీపీ నాయకుల అతిని బయటపెట్టింది.

 

 

వాస్తవానికి ఆ ఘటన గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై రాజధాని రైతులు చేసిన దాడికి ప్రతీకారంగా జరిగిందని భావిస్తున్నారు. కానీ.. వైసీపీ నాయకులు ఆ విషయం దాచి పెట్టి.. టీడీపీ నాయకులు ఓ వికలాంగుడిని గుద్దారని..అందుకే స్థానికులు వారిపై దాడి చేశారని అతిగా కవర్ చేసుకుంటూ వచ్చారు. వాస్తవానికి అక్కడ దెబ్బతిన్న వికలాంగుడెవరూ లేరని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

 

 

అయితే వైసీపీ అతి కి ఏమాత్రం తగ్గకుండా ఈ ఘటనలో టీడీపీ నాయకులు కూడా అతి చేశారు. మాచర్లలో దెబ్బ తిన్న కారును తీసుకుని డీజీపీ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. ఆ రోజే కాదు.. ఆ తరవాత రోజు కూడా బోండా ఉమ.. ఆ కారును సీపీ కార్యాలయానికి తీసుకెళ్లి మీడియా అటెన్షన్ కోసం ప్రయత్నం చేసినట్టు కనిపించింది. ఈ విషయంలో వైసీపీ నాయకులూ ఏమీ తక్కువ తినలేదు. అసలు బొత్సా, బుద్దా మాచర్ల ఎందుకు రావాలంటూ పదే పదే ప్రశ్నిస్తూ ఓవర్ యాక్షన్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: