తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం మీడియా ఎక్కువగా ఫోకస్ చేసిన అంశాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా వైరస్. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీ ఎక్కువగా స్థానాలను ఏకగ్రీవం చేయడానికి గాను ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఎక్కువగా అల్లర్లు జరిగాయి. దీనిపై మీడియా ఎక్కువగా ఫోకస్ చేసింది. వైసీపీ నాయకుల మీద ఎక్కువగా ఫోకస్ చేసి వారి అల్లర్లను ఎక్కువగా హైలెట్ చేసింది. 

 

టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న మీద మాచర్లలో జరిగిన దాడిని మీడియా ఎక్కువగా ఫోకస్ చేసింది. ఆ దాడి చేసిన వ్యక్తిని కూడా మీడియా ఎక్కువగా చూపించింది. దీనిపై చర్చా కార్యక్రమాలను కూడా ఎక్కువగానే పెట్టారు. అలాగే రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధుల గురించి కూడా ఫోకస్ చేసారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ కూడా మీడియా ఎక్కువగా కవర్ చేస్తూ వచ్చింది. ఇక కరోనా వైరస్ విషయానికి వస్తే, కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా రెచ్చిపోతుంది. మన దేశంలో ఎక్కువగా ఈ వైరస్ ప్రభావం చూపిస్తుంది. 

 

దానిని మీడియా ఎక్కువగానే ఫోకస్ చేసింది. అలాగే... మన తెలుగు రాష్ట్రాలో కరోనా కేసుల గురించి కాస్త ఎక్కువగా వార్తలు ఇచ్చింది మీడియా. తెలంగాణాలో ఒక పాజిటివ్ కేసు ఆంధ్రాలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయింది. దీని గురించి మీడియా కథనాలు ఎక్కువగా ప్రసారం చేసింది. అదే విధంగా సోషల్ మీడియా కూడా దీని పై ఎక్కువగా దృష్టి సారించింది. కరోనా వైరస్ గురించి జాగ్రత్తలతో పాటుగా, ఎంత మందికి సోకింది ఎంత మంది మరణించారు అనే విషయాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసింది మీడియా. స్థానిక సంస్థల ఎన్నికలపై రెండు తెలుగు రాష్ట్రాల మీడియా ఎక్కువగానే వార్తలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: