మొన్నటివరకు చైనా దేశంలో ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న ప్రాణాంతకమైన కరోనా వైరస్ ఇప్పుడు భారత్ కి కూడా వ్యాపించి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. అయితే మొదటి కరోనా  పాజిటివ్ కేసులు నమోదు అయినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ కరోనా  వ్యాప్తి మాత్రం శరవేగంగా జరుగుతోంది. కాగా భారత్లో కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య 88 కి చేరిందని  కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటన చేసింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీ లకు చెందిన ఏడుగురు చికిత్స తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు  ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

 

 

 ఇదిలా ఉంటే ఢిల్లీలో ఆరుగురికి ఉత్తరప్రదేశ్లో 11 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకిందని... అంతేకాకుండా రాజస్థాన్, తెలంగాణ,తమిళనాడు,ఆంధ్ర ప్రదేశ్,పంజాబ్ లో రాష్ట్రాల్లో  ఒక్కొక్కరు కరోనా  వైరస్ బారినపడి ప్రస్తుతం ఐసొలేషన్ వార్డులో చికిత్స అందుకుంటున్నారు అంటూ తెలిపింది. ఇక మహారాష్ట్రలో కూడా రోజురోజుకు కరోనా  కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో కేవలం శుక్ర శనివారాల్లోనే నలుగురు వ్యక్తులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక ఈ ఇద్దరితో కలిపి మహారాష్ట్రలో మొత్తంగా కరుణ సోకిన వ్యక్తుల సంఖ్య 26కి చేరింది. అటు కేరళ రాష్ట్రంలో కూడా ఏకంగా 19 కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

 

 

 ఇక వీరిలో ముగ్గురు వ్యక్తులు కరోనా  నుండి చికిత్స పొందుతూ పూర్తిగా కోలుకున్నారు. ఇక కరోనా  వైరస్ నియంత్రణ చర్యలు భాగంగా రాష్ట్రంలోని అన్ని బహిరంగ ప్రదేశాలతో పాటు పబ్ లను  కూడా మూసివేసినట్లు  గోవా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అయితే 88 కరోనా  పాజిటివ్ కేసులు నమోదు అయినది ఒకెత్తయితే... ఈ 88 మంది ఎవరెవరిని కలిశారు ఇంకెంతో మందికి కరోనా  సోకింది అనేది కనిపెట్టడం సవాలుగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఏకంగా నాలుగు వేల మందిని గుర్తించి వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో ముందస్తు  చర్యలు చేపడుతోంది. ప్రజలకు అవగాహన చర్యలు చేపట్టడంతో పాటు అటు కరోనా రోగులకు  ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆస్పత్రుల్లో  కూడా ఐసోలేషన్ వార్తలు ఏర్పాటు చేసి ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: