ఏపీ శాసనమండలి రేపోమాపో రద్దవుతుందని అంచనాల్లో అందరూ ఉండగా.. శాసన మండలి ఇప్పట్లో రద్దు అయ్యే అవకాశమే లేదన్నట్లుగా ఏపీలో రాజకీయ వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అయినా శాసన మండలిని రద్దు చేసి తీరాలన్న కసితో ఉన్న సీఎం జగన్పార్లమెంట్ సమావేశాల్లోనే శాసనమండలి రద్దవుతుందని చెబుతూ వస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి సంకేతాలు ఉండడంతో ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేనాటికి శాసన మండలి రద్దు అవుతుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీలో చేరికలు చూస్తే శాసన మండలి రద్దయ్యే అవకాశం లేదనే విషయం జగన్ కు సమాచారం ముందుగానే అందినట్లు తెలుస్తోంది. ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వచ్చి వైసీపీలో చేరుతున్నారు. 

 

IHG

ఎమ్మెల్సీ పోతుల సునీత, శివ నాథ రెడ్డి లు ఇప్పటికే వైసీపీ కి మద్దతు ప్రకటించారు. మరో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అలాగే తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా కీలక నాయకుడు ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ కూడా వైసీపీ కండువా కప్పుకోవాలని తహతహలాడుతున్నారు. మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీలో చేరినట్లు అవుతోంది. ఇంకా మరో ఐదుగురు ఎమ్మెల్సీలను వైసిపిలో చేర్చుకోవాలని చూస్తున్నారు. దీనిపై వైసీపీ అధిష్టానం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. వారిని ఏదో విధంగా ఒప్పించి ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే లోపు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయించాలని చూస్తోంది.


 అదే జరిగితే టిడిపికి శాసనమండలిలో బలం ఉండదని, అప్పుడు సెలక్ట్ కమిటీకి పంపించిన రెండు బిల్లులను అప్పుడే వెనక్కి రప్పించడంతో పాటు వాటిని ఆమోదించుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఒకవేళ శాసనమండలిని రద్దు చేయాలన్నా కనీసం ఏడాది పైగా సమయం పడుతుంది. వైసిపికి శాసనమండలిలో పూర్తిస్థాయి మెజారిటీ వచ్చే అవకాశం ఉండటంతో శాసన మండలి రద్దు కాకపోయినా, వైసీపీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎలాగూ టీడీపీ ఎమ్మెల్సీల బలం తగ్గిపోయే అవకాశం ఉండడంతో శాసనసభలోనూ, మండలిలోనూ తమ హవా నడుస్తుందని వైసిపి భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: