ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వారం వైసీపీ హాట్ టాపిక్ గా అయింది. కొన్ని పరిణామాలు ఆ పార్టీని ఈ వారం వార్తల్లో నిలిపాయి. రాజకీయంగా బలంగా ఉన్న ఆ పార్టీ ఈ వారం స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా వార్తల్లో నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ఆ పార్టీ నేతలు ఏకగ్రీవం చెయ్యడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. పల్నాడు, రాయలసీమ ప్రాంతాలలో ఆ పార్టీ నేతలు ఎక్కువగా ఏకగ్రీవం చేసేందుకు గాను గట్టిగానే కష్టపడ్డారు అనే చెప్పాలి. ముఖ్యంగా... స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ నేతలు తీవ్రంగా కృషి చేసారు. 

 

టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఎక్కువగా ఆరోపణలు చేసారు వైసీపీ నేతలు. రాజ్యసభ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్ధులను ఎంపిక చేసారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పేర్లను ప్రకటించారు. ఇక టీడీపీ నేతలను వైసీపీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి, టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న కరణం బలరాం తో పాటుగా మరికొందరు నేతలకు జగన్ కండువాలు కప్పేసారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. 

 

అదే విధంగా కొందరు టీడీపీ నేతలతో కూడా వైసీపీ నేతలు మంతనాలు జరిపారు. పార్టీలోకి తీసుకోవడ౦ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించడానికి సిద్దమయ్యారు. అయితే ఈ వారం ఆ పార్టీని వివాదాలు ఎక్కువగానే వెంటాడాయి. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేతల మీద దాడి చేయడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిన అంశంగా చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే ప్రధాన ఎజెండా గా వైసీపీ నేతలు ఈ వారం గట్టిగా ప్రయత్నాలు చేసారు. ఎక్కువ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారు.వైసీపీ స్థాపించి ఈ వారం తో పదేళ్ళు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఘనంగా ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: