ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సహా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి  మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇక రోజురోజుకు ఈ ప్రాణాంతకమైన వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో అటు  ప్రభుత్వంతో పాటు ఇటూ  ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంటోంది. ఇక ఈ కరోనా ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ ఎక్కువమందికి వ్యాపించకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంతో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి.

 

 

 అయితే ఈ ప్రాణాంతకమైన వైరస్ తెలంగాణ వరకు చేరుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో రోజురోజుకు కరోనా వైరస్ అనుమానితుల పెరిగిపోతుండడంతో పాటు... మరొక కరోనా  పాజిటివ్ కేసు నమోదు కావడంతో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా  వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో పాఠశాలలు సినిమా థియేటర్లు బంద్ అంటూ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుండి ఈ నిబంధన అమల్లోకి రానుంది. అంతేకాకుండా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా టీవీలలో యాడ్స్ కూడా ఇస్తున్నారు. అయితే కరోనా  వైరస్ నియంత్రణకు తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వాగతించారు. 

 

 

 కేసిఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల కేసీఆర్ మరోసారి ఉత్తమ నేత అనిపించుకున్నారు అంటూ ప్రశంసించారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా ప్రజల ఆరోగ్యాన్ని అవసరాలను భవిష్యత్ ను  దృష్టిలో ఉంచుకుని చేస్తారు అని... ప్రస్తుతం కరోనా  నియంత్రణకు తీసుకున్న నిర్ణయం కూడా అలాంటిదే అంటూ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. కరోనా  వైరస్ తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు టిఆర్ఎస్ సర్కార్ ఎంతగానో కృషి చేస్తోంది అంటూ వ్యాఖ్యానించిన మెగాస్టార్ చిరంజీవి.... కరోనా  వైరస్ నియంత్రణలో భాగంగా ఆచార్య సినిమా షూటింగులు కూడా వాయిదా వేసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఆర్టిస్టులు టెక్నీషియన్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: